HomeTelugu news

వైసీపీ నేత దాడితో ఆస్పత్రిపాలైన యువకుడు
Published By :  Divya Valluru Image Image
Proddutoor YSRCP leader attacks youth with his followers
Tuesday Sep 10, 2019
ఏపీలో జగన్ ప్రభుత్వం రాగానే కొందరు వైసీపీ నేతల ఆగడాలు శృతిమించిపోతున్నాయి. ప్రొద్దుటూరు వైసీపీ నేత శివారెడ్డి ఓ యువకుడిని చితకబాదిన ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. స్థానికంగా నివాసముండే వడ్ల నరేష్ అనే యువకుడు కొంతకాలంగా తనకు దూరంగా ఉంటున్నాడనే కోపంతో మూడు రోజుల క్రితం వైసీపీ నేత శివారెడ్డి తన అనుచరులతో కలిసి నరేష్ ను ఒక నిర్మానుష్య ప్రదేశంలో చితకబాదాడు. ఈ దాడిలో తీవ్ర గాయాలపాలైన నరేష్ గత మూడు రోజులుగా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. 

వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించే క్రమంలో యువకుడు నరేష్ ఎమ్మెల్యే ఎదుట శివారెడ్డి తనపై దాడి చేసిన విషయాన్నీ బయటపెట్టాడు.  పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోవడం లేదని యువకుడు ఎమ్మెల్యే ఎదుట బోరున విలపించాడు. దాడి చేసిన వారిపై తగు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే యువకుడిని ఓదార్చాడు.

పోలీసులను కేసు నమోదు చేసుకొని విచారించవలసిందిగా ఎమ్మెల్యే ప్రసాద్ రెడ్డి ఆదేశించారు.

   Politics

   Lifestyle