HomeTelugu news

పాక్ గడ్డ పై అడుగు పెట్టం అంటున్న శ్రీలంక క్రికెటర్లు
Published By :  Lasya Raghavaraju Image Image
Srilanka cricketers refuses to go on tour in Pakistan
Tuesday Sep 10, 2019
ఉగ్రవాద దేశంగా పేరుగాంచిన పాకిస్తాన్ గడ్డపై అడుపెట్టాలంటే శ్రీలంక క్రికెట్ ఆటగాళ్ళు బెంబేలెత్తిపోతున్నారు. ఈ కారణంగానే పాక్ టూర్ కు వెళ్ళడానికి  పది మంది శ్రీలంక క్రికెటర్లు నిరాకరించారు. ఈ నెలలో లంక టీం పాక్‌లో మూడు వన్డేలు, మూడు టి 20 ఆడాల్సి ఉంది. పాక్ పర్యటన నేపథ్యంలో శ్రీలంక క్రికెట్ బోర్డు ఆటగాళ్లతో సోమవారం సమావేశమైంది. ఈ టూర్‌కు దాదాపు 10 మంది క్రికెటర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు.  

భద్రతా కారణాల దృష్ట్యా  కెప్టెన్ లసిత్ మలింగతో సహా 10 మంది ఆటగాళ్లు పాక్​లో క్రికెట్ ఆడటానికి తాము వెళ్లబోమంటూ బోర్డు సభ్యులకు తెగేసి చెప్పారు.  ఈ జాబితాలో లంక జట్టు మాజీ సారథులు ఆంజెలో మ్యాథ్యూస్, తిసారా పెరీరా ఉన్నారు. దీంతో శ్రీలంక క్రికెట్ బోర్డు శ్రీలంక టూర్ విషయంలో డైలమాలో పడింది.

2009లో పాక్ టెస్టు మ్యాచ్ సందర్భంలో లాహోర్ లో శ్రీలంక ఆటగాళ్ల బస్సుపై ఉగ్రవాదుల దాడి జరిగింది. స్థానిక గాఫాడీ స్టేడియం వద్ద 12 మంది ఉగ్రవాదులు శ్రీలంక క్రికెటర్లు పర్యటిస్తున్న బస్సుపై కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడిలో శ్రీలంక ఆటగాళ్లు గాయాలతో బయటపడగా.. ఆరుగురు పాకిస్థానీ పోలీసులు, ఇద్దరు సామన్య పౌరులు ప్రాణాలు కోల్పోయారు. అప్పటి నుంచి ఏ దేశం భద్రతా కారణాల రీత్యా పాకిస్తాన్ వెళ్లేందుకు ఇష్టపడటం లేదు. 

   Politics

   Lifestyle