మునగాకును తినడానికి చాలా మంది ఇష్టపడరు. కానీ ఇందులోని పోషకాల గురించి తెలిస్తే మాత్రం వదిలిపెట్టరు. మునగలో విటమిన్లతో పాటు లవణాలు, యాంటీ యాక్సిడెంట్లు సమృద్ధిగా వుంటాయి. మునగాకుల్లో విటమిన్స్, ఎమినో యాసిడ్స్, మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. దీనిని రోజూ వారి ఆహారంలో తీసుకోవటం వలన చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి.
మునగాకు ఆరోగ్య ప్రయోజనాలు:
- కంటి చూపు తక్కువగా ఉన్నవారు,రేచీకటితో బాధపడేవారు మునగాకు రసాన్ని తాగటం వలన మంచి పలితం ఉంటుంది
- మునగాకుల్లో వుండే 46 రకాల సహజ యాంటీ యాక్సిడెంట్లు క్యాన్సర్ కణాల పెరుగుదలను, కాలేయ సంబంధిత వ్యాధుల్ని, అల్జీమర్స్, అల్సర్లను అదుపు చేస్తాయి.
- మునగాకులో ఇనుము అధికంగా ఉంటుంది. రక్తహీనతతో బాధపడేవారు రోజూ ఆహారంలో మునగాకును రోజూ ఆహారంలో చేర్చుకోవాలి.
- కీళ్ళనొప్పులను తగ్గించడంలోను మునగ ముందుంటుంది.
- ఎదిగే పిల్లలకి ఈ మునగాకిని తినిపించడం వలన ఎముకలు చాలా ధృడంగా మారుతాయి.
- బరువు తగ్గాలనుకునేవారికి మునగాకుపొడి మంచిది. ఇది కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.
- థైరాయిడ్‌ను రెగ్యులేట్ చేసే న్యాచురల్ మెడిసిన్ మునగాకు.
- మునగాకులో ఉండే క్లోరోజెనిక్ యాసిడ్ ద్వారా బ్లడ్‌లో షుగర్ లెవల్స్‌ని కంట్రోల్ చేస్తుందట. పోషకలేమితో బాధపడేవారికి మునగ మంచి ఔషధం.
- పోషకాహారం తగినంత అందని బాలింతలకు గర్భిణీలకు మునగాకు పొడి దివ్యౌషధంలా పనిచేస్తుంది.
- కీళ్ల నొప్పులు ఉన్నవారు ఈ మునగాకులను ఒక ముద్దలాగా నూరి నొప్పి ఉన్న చోట కట్టు కట్టడం వలన నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది.
- థైరాయడ్ సమస్యతో బాధపడేవారు ఈ మునగాకుని తినటం వలన సమస్య తీవ్రతని తగ్గించుకోవచ్చు.