ప్రకృతి పరంగా, సహజసిద్ధంగా లభించే సపోటా పండు అద్భుతమైన రుచిని అందించే ఆరోగ్యకర పండ్లలో ఒకటి. రుచితో పాటు బోలెడన్ని పోషకాలతో నిండిన ఈ పండు అధికంగా కేరళ రాష్ట్రంలో పండుతుంది. ఆ తరువాత కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో గణనీయంగా లభిస్తుంది. ఇతర పండ్లతో పోల్చితే చౌకగా కూడా దొరుకుతాయి. ఈ సీజన్లో సపోటా ఎక్కువగా దొరుకుతుంది గనుక అందరూ రోజుకు రెండు పండ్లు తినటం మంచిది. సపోటా వల్ల కలిగే ఆరోగ్య పరమైన ఉపయోగాలను ఇప్పుడు తెలుసుకుందాం..
సపోటాతో లాభాలు:
1. పిండిపదార్థాలు, అవసరమైన ఇతర పోషకాలు సపోటాలో అధిక మోతాదులో ఉండటం వల్ల గర్భిణీలకు, పాలు ఇచ్చే తల్లులకు చాలా ఉపయోగకరమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
2. నిద్రలేమితో, అందోళనతో బాధపడుతున్న వ్యక్తులకు సపోటా చాలా మంచిది. దీనిలో అధికంగా ఉండే ‘విటమిన్ ఎ’ కంటిచూపును మెరుగుపరచేందుకు దోహదం చేస్తుంది.
3. విటమిన్ 'ఎ' మరియు విటమిన్ సి గుణాలు ఈ పండులో చాలా సమృద్ధిగా ఉంటాయి. కంటి చూపుకి, చర్మ సంరక్షణకు మరియు హృద్రోగ సమస్యల పరిష్కారానికి ఈ పండులోని గుణాలు ఎంతో ఆవశ్యకం, అందుకే వైద్యులు ఈ పండును తినడం మానవద్దని సూచిస్తుంటారు.
4. ఈ పండులో ఉండే తన్నిస్ అనే ప్రత్యేక సమ్మేళనానికి ఉదరంలో తాపాన్ని తగ్గించే గుణాలు ఉంటాయి. అందుకనే గ్యాస్ట్రిక్ మరియు పేగుల సమస్యలు దరిచేరకుండా ఉండేందుకు ఈ పండు ఎంతో మేలు చేస్తుంది.
5. సుక్రోస్ మరియు ఫ్రూక్టోజ్ ఎక్కువగా లభించే ఈ పండును చిన్నపిల్లల ఆరోగ్యానికి మరియు గర్భిణీ స్త్రీలకు ఎక్కువగా సిఫారసు చేస్తుంటారు వైద్యులు.
6. ఎముకల దృఢత్వానికి కాల్షియం గుణాలు ఎంతో అవసరం కాగా సపోటలో ఎక్కువగా లభిస్తాయి. అందుకనే రోజుకి కనీసం రెండు సపోటలైనా తినడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.
7. అంతేకాకుండా రోజూ సపోట రసం తీసుకోవడం వలన శరీరానికి విటమిన్ సి సమృద్ధిగా చేరి రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఈ గుణాలు ఫ్రీ రాడికల్స్ ను అంతమొందించి అంతర్గత అవయవ వ్యవస్థను మెరుగుపరుస్తాయి.
8. సపోటాలో ప్రోటీన్ల శాతం ఎక్కువ కాగా శరీర బరువును నియంత్రణలో ఉంచుతూ మధుమేహం మరియు గుండె సంబంధిత సమస్యలతో పోరాడుతుంది.
9. సౌందర్య నిపుణుల ప్రకారం రోజూ సపోట రసం తీసుకుంటే జుట్టు మెత్తబడి చుండ్రు తొలగడమే కాకుండా జుట్టు బలంగా పెరుగుతుంది.
10. ఈ పండులో ఉండే విటమిన్ ఎ మరియు విటమిన్ సి గుణాలు సూర్య రష్మి మరియు ఇతర కాలుష్య మాధ్యమాల నుండి చర్మాన్ని సంరక్షిస్తాయి.
11. ఇందులో అధికంగా ఉండే మెగ్నీషియం మరియు ఐరన్ గుణాలు రక్తప్రసరణను నియంత్రిస్తూ రక్తహీనత కలుగకుండా చూస్తాయి.