శీతాకాలం వచ్చిందంటే చాలు కొందరికి గొంతునొప్పి చాలా ఇబ్బంది పెడుతుంది. గొంతులో ఇన్ఫెక్షన్ కారక సూక్ష్మక్రిములు ఏర్పడటం వలన గొంతునొప్పి (త్రోట్ పెయిన్) మొదలవుతుంది. అలాగే చల్లటి పానీయాలు, చల్లటి తేమగాలి పడకపోవడం వల్ల, అలర్జీలు, స్మోకింగ్, జలుబు, దగ్గు, ఫ్లూ మొదలగు కారణాలతో గొంతునొప్పి వచ్చి వేధిస్తుంది.
గొంతు నొప్పితో పాటు, గొంతులో కిచ్ కిచ్, దురద, ఇరిటేషన్ , గొంతు, మెడ చుట్టూ వాపు వంటి లక్షణాలు కనబడుతాయి. ఆహారాన్ని మింగుతుంటే చాలా ఇబ్బందిగా వుంటుంది. దీన్ని నివారించేందుకు ఈ క్రింది చిట్కాలు పాటిస్తే ఉపశమనం కలుగుతుంది.
- గోరువెచ్చని మంచి నీటిలో 1/2 లేదా 1 టీస్పూన్ ఉప్పును కలిపి ఆ మిశ్రమాన్ని నోట్లో పోసుకుని పుక్కిలించాలి.
- తేనెతో వేడి టీ, సూప్ ఉడకబెట్టిన పులుసు లేదా నిమ్మకాయతో వెచ్చని నీరు వంటివి గొంతు మంటను తగ్గించేందుకు సాయపడతాయి.
- హేర్బల్ టీ గొంతు నొప్పికి చాలా అద్భుతమైనటువంటిది. దీనికి కొంచెం అల్లం చేర్చితే చాలు. ఫలితం మెండుగా ఉంటుంది.
- హాట్ చికెన్ సూప్ లేదా టమోటో సూప్ వంటివి గొంతునోప్పికి చాలా అద్భుతంగా పనిచేస్థాయి, ఇన్ఫెక్షన్ కూడా దూరం చేస్తుంది.
- ఒక టీస్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ కు ఒక స్పూన్ తేనె మిక్స్ చేసి, ఒక కప్పు వేడి నీటిలో మిక్స్ చేయాలి. మొత్తం మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసి, వేడి వేడిగా తాగాలి.
- గొంతు నొప్పి తగ్గించడంలో వెల్లుల్లి గ్రేట్ రెమెడీ. వెల్లుల్లిలో అల్లిసిన్ అనే కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇది బ్యాక్టీరియాతో పోరాడుతుంది. ఒక ఫ్రెష్ వెల్లుల్లి రెబ్బను తీసుకుని, నమిలి మ్రింగడం వల్ల దగ్గు మందులా పనిచేస్తుంది.
- హైడ్రోజన్ పెరాకైడ్ ను తీసుకుని, అందులో కొద్దిగా నీరు మిక్స్ చేసి, వేడి చేయాలి. ఈ నీటితో గార్గిలింగ్ చేసి నీరును ఉమ్మేయాలి. ఇది కూడా గొంతునోప్పిని నివారించడంలో బాగా ఉపయోగపడుతుంది.