మన శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవాల్లో ఊపిరితిత్తులు ఒకటి. స్పాంజిల్లా ఉండే ఈ ఊపిరితిత్తులు గాలిలోంచి ఆక్సిజన్ ను సేకరించి.. శరీరానికి అందిస్తాయి. అదే సమయంలో శరీరంలో ఉత్పత్తయ్యే కార్బన్ డయాక్సైడ్, ఇతర ఉత్పన్నాలను గాలిలోకి విడుదల చేస్తాయి. రెండు నిమిషాల పాటు ఊపిరితిత్తులు పనిచేయకపోతే మరణం సంభవిస్తుంది. కనుక లివర్‌ను మనం ఆరోగ్యంగా ఉంచుకోవాలి.
ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే ముందుగా సిగరెట్లు, బీడీల వంటివి తాగడం మానేయాలి. సిగరెట్ లో ఉండే 7 వేల రసాయనాలు ఊపిరితిత్తుల్లోని 70 శాతం కణాలను నాశనం చేస్తుంది. మాములు వ్యక్తుల కంటే పొగ తాగే వారిలో కేన్సర్ వచ్చే అవకాశాలు 15 నుంచి 30 శాతం అధికంగా ఉంటుంది. ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే.. శ్వాసకోశ సంబంధిత వ్యాధులను దూరం చేసుకోవాలంటే.. ఫ్రూట్స్ తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అందుకు గాను కింద సూచించిన వాటిని నిత్యం తీసుకోవాలి.
* ఆరెంజ్ పండ్లను డైట్లో చేర్చుకోవడం ద్వారా ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి. ఇందులో సి విటమిన్ .. ఊపిరితిత్తుల ఆక్సిజన్ శోషణ సామర్థ్యాన్ని పెంచుతాయి.
* దానిమ్మపండ్లలో యాంటీఆక్సిడెంట్స్ సమృద్దిగా ఉండటం వలన ఊపిరితిత్తులలో కణితులను నివారించడంలో సహాయం చేస్తాయి. అంతేకాక అవి శ్వాస సమస్యల చికిత్సకు అద్భుతమైన ఆహారంగా దానిమ్మ పనిచేస్తుంది.
* ఇక ఆహారంలో ప్రతిరోజూ ఉపయోగించే ఉల్లిపాయలు ఎటువంటి సందేహం లేకుండా ఘాటుగా ఉంటాయి. కానీ వాటిలో ఉండే ఆవిర్లు ఊపిరితిత్తుల ఆరోగ్యానికి అద్భుతంగా పనిచేస్తాయి. పొగ త్రాగేవారు ఆరోగ్యకరమైన ఊపిరితిత్తుల కోసం తప్పనిసరిగా ఉల్లిపాయలను తినాలి.
* అలాగే యాపిల్స్‌లో ఫ్లేవనాయిడ్స్ మరియు విటమిన్లు E, B మరియు C ఉంటాయి. ఈ మూలకాలను అన్ని కలిసి అద్భుతమైన ఊపిరితిత్తుల ఆరోగ్యానికి పనిచేస్తాయి.
* ద్రాక్షపండులో ఊపిరితిత్తులలో కంతి పెరుగుదలను బంధించి వేసే నరింగిన్ అనే కీలకమైన ఫ్లేవనాయిడ్ ఉంటుంది. ద్రాక్ష పండ్లు ఊపిరితిత్తులను శుభ్రం చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.