HomeTelugu lifestyle

హైబీపీని కంట్రోల్ చేయాలంటే ఇవి తినాల్సిందే
Published By :  Divya Valluru Image Image
Foods to eat to lower your High blood pressure and keep it down
Friday Oct 09, 2020
ప్రపంచవ్యాప్తంగా చాప కింద నీరులా ఎంతో మందిని కబలిస్తున్న వ్యాధి హైబీపీ (అధిక రక్తపోటు) . ఒత్తిడి, ఆందోళన, గుండె జబ్బులు, మద్యం అధికంగా సేవించడం తదితర అనేక కారణాల వల్ల చాలా మందికి హైబీపీ వస్తుంటుంది. హైబీపీ ఉన్నట్టు లక్షణాలు కూడా బయటకు కనబడవు. అయితే నిశ్శబ్దంగా ఇది గుండెను, కిడ్నీలను డామేజ్‌ చేసేస్తుంది.  

ఈ కింద తెలిపిన సహజ సిద్ధమైన పదార్థాలను నిత్యం ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా హైబీపీ సమస్య నుంచి బయట పడవచ్చు. మరి ఆ ఆహార పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

* పొటాషియమ్‌ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు రక్తపోటును నియంత్రిస్తాయి. పండ్లు, కూరగాయల్లో అధిక స్థాయిలో పొటాషియమ్‌ ఉంటుంది. స్వీట్‌ పొటాటోస్‌, టామోటా, ఆరెంజ్‌ జ్యూస్‌, అరటిపళ్లు, బటానీ, ఎండుద్రాక్ష వంటి వాటిలో కూడా పొటాషియమ్‌ అధిక పరిమాణాల్లో ఉంటుంది.

* దాల్చినచెక్కలో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. దీన్ని నిత్యం ఆహారంలో భాగం చేసుకుంటే హైబీపీ తగ్గుతుంది. తేనె, దాల్చినచెక్క పొడిని నిత్యం ఒక టీస్పూన్ మోతాదులో తీసుకుంటే హైబీపీతోపాటు పీసీవోడీ, డయాబెటిస్ సమస్యల నుంచి బయట పడవచ్చు. అలాగే అధిక బరువు కూడా తగ్గుతారు.

*డార్క్‌చాక్లెట్స్‌కు కూడా రక్తపోటును నియంత్రణలో ఉంచగలిగే శక్తి ఉంది. డార్క్‌ చాక్లెట్లు తినడం వల్ల రక్తనాళాలు ఎలస్టిక్‌ (సాగే గుణం) నేచర్‌ను సంతరించుకుంటాయి. దాదాపు 70 శాతం కోకాతో తయారైన డార్క్‌ చాక్లెట్‌తో చాలా ఉపయోగాలున్నాయి.

* అవిసె గింజెల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇవి హైబీపీని కంట్రోల్ చేస్తాయి. అలాగే ఈ గింజల వల్ల ఇతర అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అవిసెగింజలను అలాగే తినవచ్చు. లేదా పొడి చేసుకుని మజ్జిగ, ఫ్రూట్ సలాడ్ వంటి వాటిలో కలుపుకుని కూడా తినవచ్చు.

* యాలకులను నిత్యం ఆహారంలో భాగం చేసుకోడం ద్వారా హైబీపీకి చెక్ పెట్టవచ్చు. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యాన్ని పరిరక్షిస్తాయి. అలాగే వీటిలో ఉండే ఫైబర్ మన శరీరంలోని కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.

* వెల్లుల్లి హైబీపీని తగ్గించడంలో అమోఘంగా పనిచేస్తుంది. నిత్యం ఒకటి లేదా రెండు వెల్లుల్లి రెబ్బలను పచ్చిగా తినడం వల్ల హైబీపీ, కొలెస్ట్రాల్ తగ్గుతాయి. గుండె సమస్యలు రాకుండా ఉంటాయి.

   Politics

   Lifestyle