కరోనా వైరస్ వ్యాప్తితో ఇప్పుడు ప్రజలు ఆరోగ్యం పై శ్రద్ధ వహిస్తున్నారు. కరోనా దరిచేరకుండా ఇమ్మ్యూనిటీని పెంచుకునేందుకు బలవర్ధక ఆహారాన్ని తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కరోనా వచ్చిన తర్వాత బాదంపప్పులకి బాగా గిరాకీ వచ్చింది. ఎంతో రుచికరంగా ఉండే బాదంలో విటమిన్లు మెండుగా ఉంటాయి. ధర కాస్త ఎక్కువే అయినా బాదం పప్పులను రోజూ తినాలి. రోజూ యావరేజ్‌గా 4 పప్పులు తినాలి.
రోజూ బాదం తినడం వల్ల కలిగే ప్రయోజనాలు
*రోజూ బాదం గింజలు తినడం ద్వారా శరీరంలో వైరల్ ఇన్ఫెక్షన్లపై పోరాడే శక్తి పెరుగుతుంది. తెల్లరక్తకణాల సామర్థ్యం పెరుగుతుంది.
*ప్రతిరోజూ ఉదయం బాదం తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. తెల్లరక్తకణాల సామర్థ్యం పెరిగి ఇన్ఫెక్షన్ల బారిన పడే అవకాశాలు చాలా తక్కువగా ఉంటుంది.
*వీటిలో పీచు పదార్థం సమృద్ధిగా లభిస్తుంది. మలబద్ధకం, ఇతర సమస్యలున్నవారు రోజుకు నాలుగైదు బాదం పప్పులు తీసుకొని.. బాగా నీళ్లు తాగితే చక్కటి పరిష్కారం దొరుకుతుంది.
*బాదం తింటే విటమిన్ ఈ పుష్కలంగా లభిస్తుంది. బాదం మంచి యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేసి కొవ్వును నియంత్రిస్తుంది.
*బాదంలో ఆరోగ్యానికి మేలు చేసే కొవ్వులు, మాంసకృతులు, విటమిన్లు, ఖనిజ లవణాలు సమృద్ధిగా లభిస్తాయి.
*తరచుగా బాదం తినడం వల్ల మలబద్దకం సమస్యకు చెక్ పెడుతుందని మీకు తెలుసా. ప్రతిరోజూ ఓ నాలుగైదు బాదం పప్పులు తింటే మీ శరీరానికి ఎంతో శ్రేయస్కరం.
*బాదం తింటే మీకు కావాల్సినంత పొటాషియం లభిస్తుంది. ఇందులో సోడియం తక్కువ కనుక రక్తపోటు సమస్య అసలే ఉండదు.
*రక్తప్రసరణ సరిగా జరిగే గుండె సంబంధిత సగం జబ్బులకు పరిష్కారం దొరికినట్లే.
*ఉదయాన్నే బాదం తింటే శరీరానికి కావలసిన ఇనుము లభిస్తుంది. బాదంలో ఉంటే మోనోశాచ్యురేటెడ్, పాలీశాచ్యురేటెడ్స్ శరీరంలో నిల్వ ఉండే చెడు కొవ్వులను నాశనం చేస్తుంది.
*బాదం తరచుగా తినేవారికి గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం తక్కువ అని అధ్యయనాలు చెబుతున్నాయి.