HomeTelugu lifestyle

వాల్నట్స్ తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
Published By :  Lasya Raghavaraju Image Image
Amazing health benefits of Walnuts to human body
Saturday Sep 26, 2020
చూడడానికి రాళ్ళల కనిపించే వాల్నట్స్ ను మన డైట్లో చేర్చుకోవడం వలన ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. రోజూ గుప్పెడు మోతాదులో వాల్ నట్స్ తింటే అనేక రకాల ఆరోగ్య సమస్యలకు స్వస్తి చెప్పవచ్చు అంటున్నారు పరిశోధకులు.  నిపుణుల అభిప్రాయం ప్రకారం ఒక ఔన్సు వాల్నట్స్‌లో 4 గ్రాముల ప్రోటీన్లు, 2 గ్రాముల ఫైబర్, ఇంకా ఎక్కువ మోతాదులో మాంగనీస్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, జింక్, సెలీనియం, విటమిన్-బీ లాంటి ఖనిజాలు ఉంటాయి. అంతేకాకుడా ఎంయూఎఫ్ఐ, ఓమేగా-3 లాంటి ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా దొరుకుతాయి.

రోజు గుప్పెడు వాల్‌ నట్స్‌ తింటే కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం

1.ఈ వాల్ నట్స్ బరువు తగ్గించడంలో సహాయపడతాయి. ఇందులో ఫైబర్, మరియు ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి.
 
2. వాల్ నట్స్‌లో ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి అన్ని రకాల గుండె జబ్బులను ఎదుర్కొనడానికి  సహాయపడతాయి. 
 
3. వాల్నట్స్ లో ఉండే విటమిన్ ఇ మరియు ప్లెవనాయిడ్స్ జ్ఞాపకశక్తి లోపానికి గురి చేసే హానికరమైన ఫ్రీరాడికల్స్ మరియు కెమికల్స్‌ను నాశనం చేస్తుంది. కనుక దీనిని బ్రెయిన్ ఫుడ్ అని అంటారు.
 
4. ప్రతిరోజు మన డైట్లో వాల్ నట్స్‌ను చేర్చుకోవడం చాలా మంచిది. ఇది బ్లడ్ ప్రెజర్‌ను తగ్గిస్తుంది. 
 
5. నానబెట్టిన వాల్ నట్స్‌ను ప్రతిరోజు 5 చొప్పున తీసుకోవటం వలన కీళ్లనొప్పులు, వాపులు తగ్గిపోతాయి. 
 
6. గర్భిణీ స్త్రీలు ఈ నట్స్‌ను తినడం వలన లోపల ఉన్న పిండానికి ఎలాంటి ఎలర్జీలు కలుగకుండా వ్యాధినిరోధకతను పెంచుతాయి.
 
7. ప్రతిరోజు వీటిని మన డైట్లో చేర్చుకోవడం వలన శరీరం ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటమే కాకుండా ఆయుష్షు కూడా పెరుగుతుంది.
 
8. వాల్ నట్స్‌లో మెలటోనిన్ అనే కాంపౌడ్ ఎక్కువగా ఉంటుంది. ఇది మనం గాఢంగా నిద్రపోవడానికి సహాయపడుతుంది.

9. వాల్ నట్ లో ఉండే ఆయిల్ లక్షణాలు స్కిన్ ఇన్ఫెక్షన్స్ ను నివారిస్తాయి. వాల్ నట్ ఆయిల్లో, యాంటీ ఫంగాల్ , యాంటీ ఇన్ల్ఫమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.


   Politics

   Lifestyle