పిల్లలు మొదలుకుని పెద్దల వరకూ ప్రతి ఒక్కరూ ఏదో సందర్భంలో నిద్రలో గురక పెడతారు. సాధారణంగా గురక పెట్టే అలవాటు ఉంటే వారికి కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నట్లే. స్థూలకాయం, నాలుక పెద్దగా ఉండడం, కొండ నాలుక పెద్దగా ఉండడం, దవడల నిర్మాణంలో తేడాలు ఉన్నవారికి గురక సహజం. తాజాగా గురకపెట్టే వారికి కరోనా వచ్చిందంటే ముప్పు మరింత పెరుగుతుందని పరిశోధకులు వెల్లడించారు.
సాధారణ మనుషులకు వచ్చిన కరోనా కన్నా, గురకపెట్టే వాళ్లకు కరోనా వస్తే వారి ప్రాణాలకు మూడురెట్లు అధిక ముప్పు ఉంటుందట. దీనిమీద ఇప్పటివరకు 18 అధ్యయనాలు చేశారు పరిశోధకులు. గురకపెట్టి నిద్రపోయేవారి కండరాలు విశ్రాంతి తీసుకునే సమయంలో శ్వాసనాళంలోకి తాత్కాలికంగా కొన్ని క్షణాలపాటు గాలి సరిగా పోదని, ఫలితంగా ప్రాణాలకు ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందని అధ్యయనంలో తేలింది.
అంతేకాదు మరో ముఖ్యమైన విషయాన్ని వెల్లడించారు. మధుమేహం, స్థూలకాయం, రక్తపోటు వ్యాధులు ఉన్నవారికి కరనో వస్తే, అదో పెద్ద వ్యాధిలా భావించాల్సిన పనిలేదు అంటున్నారు. ఈ మూడు ఇంకా డేంజర్ అంటున్నారు. ఇప్పుడు కరోనా పాజిటివ్ వచ్చినవాళ్లు కోలుకుంటున్నారు. కానీ ముందున్న వ్యాధుల నుంచి మాత్రం కోలుకోలేకపోతున్నారు.