HomeTelugu lifestyle

ట‌మాటా వల్ల ఆరోగ్యానికి కలిగే అద్బుత ప్రయోజనాలు
Published By :  Lasya Raghavaraju Image Image
Astonishing health benefits of Tomatoes to Human-body
Monday Aug 17, 2020
ప్రతి వంటింట్లో తప్పకుండ ఉండే కాయగూర టమాటా. వంటల్లో టమోటాను వేయటం వలన వంటకు రుచి రావటమే కాకుండా ఆరోగ్యానికి కూడా మంచిది. టమోటాలో విటమిన్ సి, కే, ఐర‌న్‌, ఫోలేట్, పొటాషియం వంటి మిన‌ర‌ల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఖనిజాలు అధికంగా ఉంటాయి, అందువలన టమోటాను విరివిగా ఆహారంలో తీసుకోవడం వలన ఆరోగ్యానికి ఎంతో మేలు. అంతేకాదు ట‌మాటా వ‌ల్ల మ‌రెన్నో ప్ర‌యోజ‌నాలున్నాయి అవేంటో ఓ సారి తెలుసుకోండి.

* శ‌రీరంలోని గ్లూకోజ్ లెవెల్స్‌ని ట‌మాటాలు బ్యాలెన్స్ చేస్తాయి. మ‌ధుమేహంతో బాధ‌ప‌డేవారు ట‌మాటాలు తింటే మంచిదంటున్నారు నిపుణులు.
* ట‌మాటాలో గ్లూటాథియోన్ స‌మృద్ది ఉంటుంది. ఇది క్యాన్స‌ర్ వంటి మ‌హ‌మ్మారిని ద‌రిచేర‌కుండాచేస్తుంది.
* టమోటాలోని పొటాషియం రక్తపోటు వ్యాధికి ఎంతో పనిచేస్తాయి. 
* ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ చ‌ర్మాన్ని మృదువుగా, అందంగా త‌యార‌య్యేలా చేస్తుంది. 
* ట‌మాటాలో ఉండే బీటా కెరోటిన్‌, లైకోపీన్ కంటికి మేలు చేస్తుంది. కంటిచూపును మెరుగుప‌రిచేందుకు ట‌మాటా ప‌నిచేస్తుంది.
* మ‌తిమ‌రుపు ఉన్న‌వారికి ట‌మాట మేలు చేస్తుంది. అంతేకాదు డిప్రెష‌న్‌, టెన్ష‌న్ వంటి స‌మ‌స్య‌ల‌ను ట‌మాటా దూరం చేస్తుంది. 
* గ‌ర్భిణీ మ‌హిళ‌లు ట‌మాటాలు తింటే మంచిది. అలాగే గుండె స‌మ‌స్య‌లు ఉన్న‌వారికి కూడా ట‌మాటా ఉప‌యోగ‌ప‌డుతుంది.
* ఇందులో ఉండే మెగ్నీషియం ఎముక‌ల‌ను దృఢంగా ఉంచుతుంది. అలాగే ట‌మాటాలు బీపీని కంట్రోల్‌లో ఉంచుతుంది. 
* అధికంగా ర‌క్తం గడ్డ‌క‌డితే గుండెపోటు వ‌చ్చే ప్ర‌మాదాలు ఎక్కువ‌గా ఉంటాయి. అందుకే దాన్ని కంట్రోల్ చేయ‌డానికి రోజుకో ట‌మాటా తింటే స‌రిపోతుంది.    
* బ‌రువు త‌గ్గాల‌నుకునేవారికి ట‌మాటాలు బాగా ప‌నిచేస్తాయి. టమోటా తీసుకుంటే.. 80 శాతం శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ పోతుంది.క్యారెట్‌, బీట్‌రూట్ జ్యూస్‌లో ట‌మాటా కూడా యాడ్ చేసుకొని తాగితే ర‌క్తం మెరుగ‌వ్వ‌డంతోపాటు వెయిట్‌లాస్ అవుతారు.

   Politics

   Lifestyle