HomeTelugu lifestyle

నేరేడు పండ్లు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
Published By :  Lasya Raghavaraju Image Image
amazing health benefits of bitter Blueberrys to Human-body
Friday Jul 24, 2020
శీతాకాలంలో ఎక్కువగా లభించే పండ్లలో నేరేడు పండు ఒకటి. విటమిన్ బి, మేగ్నీసియం, పొటాషియం, కాల్షియం వంటి ఖనిజాలతో నేరేడుపళ్ళు సమృద్దిగా ఉంటాయి. వీటిలో విటమిన్ సి అధికంగా లభిస్తుంది. దీనివల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వర్షాకాలంలో వచ్చే అనేక రోగాలను తట్టుకునే శక్తిని ఇది ఇస్తుంది. వీటిని తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.  అందుకే ఈ పండ్లని ఔషధాల తయారీలోనూ ఉపయోగిస్తారు.

నేరేడు పండ్లు తింటే కలిగే ఉపయోగాలు ఏంటో తెలుసుకుందామా....

  • నేరేడులో పుష్కలంగా దొరికే ఇనుము శరీరానికి ఎంతో అవసరమైన హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచడానికి సాయం చేస్తుంది. రక్తాన్ని శుద్ధి చేయడంలోనూ ఇది తోడ్పడుతుంది. 
  • వీటిని తినడం వల్ల అజీర్తి సమస్యలు దూరమవుతాయి. ఆహారం బాగా జీర్ణం అవుతుంది. జీవక్రియల రేటు మెరుగుపడుతుంది.
  • మధుమేహం ఉన్న వారికి నేరేడు పండు మంచి ఔషధం. దీనిని రోజూ తింటే రక్తంలోని చక్కెర శాతం క్రమబద్ధమవుతుంది. తరచూ దాహం వేయడం, మూత్రానికి పోవడం వంటి సమస్యలు అదుపులో ఉంటాయి. ఇది మంచి యాంటీ డయాబెటిక్ గా పనిచేస్తుంది.
  • అధిక రక్తపోటుకు గురికాకుండా చూస్తుంది. రక్తపోటును అదుపులో ఉంచుతుంది. గుండె పనితీరును మెరుగుపరుస్తుంది.
  • నేరేడును తరచూ తినడం వల్ల చర్మంపై ముడతలు పడవు. వృద్ధాప్య ఛాయలు కూడా త్వరగా రావు.

   Politics

   Lifestyle