HomeTelugu lifestyle

ఆల్కహాల్‌ ఆధారిత సానిటైజర్‌ తయారు చేసుకొండిలా
Published By :  Ravi Koneri Image Image
Procedure to Make Homemade Natural Hand Sanitizer
Tuesday Mar 03, 2020
చైనాలోని వుహాన్ నగరంలో పుట్టి ప్రపంచ దేశాలను గజగజ వణికిస్తున్న కరోనా వ్యాధికి ఎటువంటి మందు లేదు.కేవలం నివారణ ఒక్కటే మార్గం. కరోనా (కొవిడ్‌-19) వైరస్‌ను ఎదుర్కోవడానికి చేతులను తరచూ శుభ్రం చేసుకోవాలి.  తుమ్మినపుడు, దగ్గినపుడు మూతికి టవల్‌, చేతిరుమాలు అడ్డంగా పెట్టుకోవాలి. ముఖానికి మాస్క్‌లు ధరించాలి. సబ్బుతో గానీ, సానిటైజర్‌తో గానీ ఎక్కువసార్లు కడుక్కోవాలి. 

సాధారణంగా సానిటైజర్‌లు మార్కెట్లో బాగానే దొరుకుతాయి. అయితే ఈ వైరస్ వేగంగా వ్యాపిస్తుండడంతో ఆల్కహాల్‌ ఆధారిత సానిటైజర్లకు భారీ డిమాండ్ నెలకొంది.  "లైఫ్‌బాయ్‌ టోటల్‌ 10" అనేది ఆల్కహాల్‌ ఆధారిత సానిటైజర్‌. కానీ ఇది చాలా చోట్ల ‘అవుటాఫ్‌ స్టాక్‌’ గా ఉంది. ఒకవేళ మీకు దొరికితే, వెంటనే ఓ ఐదారు తెచ్చుకోండి.

ఇక ఆల్కహాల్‌ ఆధారిత సానిటైజర్‌ లభించని వారు ఇంట్లోనే దీనిని తయారుచేసుకోవచ్చు. దాని తయారీ విధానం ఈ కింద చూద్దాం.

1. ముందుగా మీకు దగ్గరలోని సర్జికల్‌ షాపుకెళ్లి ‘‘ఐసో ప్రొఫైల్‌ ఆల్కహాల్‌’’ తెచ్చుకోండి.
2. మీ ఇంట్లోని కలబంద (అలొవెరా) కాడను తుంచి, గుజ్జును తీసి పక్కన పెట్టండి.
3. ఇప్పుడు ఒక చిన్న బౌల్‌ తీసుకుని మూడింట రెండు వంతులు ఐపిఏ పోయండి.
4. తర్వాత మూడింట ఒక వంతు కలబంద గుజ్జును వేయండి.
5. బాగా కలపండి.
6. సువాసన కోసం ఏదైనా సెంట్‌ ఆయిల్‌ రెండు చుక్కలు కలుపుకోండి (మీకు అవసరమనిపిస్తేనే)
7. ఆ మిశ్రమాన్ని ఒక బాటిల్‌లోకి నింపుకుని, చేతులు కడిగినప్పుడల్లా రెండు మూడు చుక్కలు వేసుకుని బాగా రుద్దుకుని కడుక్కోండి.

ఇంతే. హోమ్‌మేడ్‌ సానిటైజర్‌ రెడీ. సిడిసి సూచనల ప్రకారం, ఈ సానిటైజర్లో 60 శాతం ఆల్కహాల్‌ ఉండాలి. పైన చెప్పిన నిష్పత్తి ప్రకారం కలిపితే, అందులో ఆల్కహాల్‌ శాతం కొంచెం ఎక్కువగానే అంటే, 60,66 శాతం ఉంటుంది. కాబట్టి భాగాలు కరెక్ట్‌గా ఉండేట్టు చూసుకోండి. మైక్రోబయాలజిస్ట్‌లు, శాస్త్రవేత్తలు, డాక్టర్లు చెబుతున్నదాని ప్రకారం మీరు ఎప్పుడు చేతులు కడిగినా కనీసం 20 సెకన్లు బాగా రుద్దాలి. ఇది చాలా చాలా ముఖ్యం.

   Politics

   Lifestyle