HomeTelugu lifestyle

కాకరకాయతో కలిగే లాభాలు తెలిస్తే వామ్మో అంటారు
Published By :  Divya Valluru Image Image
Amazing health benefits of Bitter Gourd to human body
Tuesday Feb 18, 2020
భరించలేనంత చేదుగా ఉండే కాకరకాయను తినడానికి చాలా మంది ఇష్టపడరు.  ఇది శరీరానికి మంచిదని తెలిసినా చేదుగా ఉంటుందనే నెపంతో ఈ కాలంవారు దీని వంక కూడా చూడరు. విటమిన్ ఏ, సి, బి1, బి2, బి3 సమృద్ధిగా లభించే కాకర వలన కలిగే లాభాలు తెలుసుకుంటే ఈ కాయను కష్టమైన తినితీరాల్సిందే అని అనిపిస్తుంది. 

కాకరకాయ వలన కలిగే ఉపయోగాలు ఏంటో తెలుసుకుందామా....

* కాకరకాయలో కరోటేనైడ్స్, విసిన్, చరడిన్, పొటాషియం, జింక్, మంగనీజ్, ఇంకా మోమోర్దిన్ వంటి మినరల్స్ ఉంటాయి కాబట్టి బరువు తగ్గాలనుకునేవారికి గొప్ప వరం లాంటిది అని చెప్పుకోవచ్చు.
* టైప్ 2 డయాబెటిస్ ని అడ్డుకుంటుంది ఇది. అందుకే షుగర్ పేషెంట్స్ కి కాకరకాయ ఎక్కువగా సూచిస్తుంటారు న్యూట్రిషన్ నిపుణులు.
* రోజుకొక పచ్చి కాకరకకాయను తింటుంటే ఉబ్బసం తగ్గుతుంది
* బరువు తగ్గాలనుకునేవారు రోజూ కాకరకాయ తీసుకుంటే మేలు. 
* ఏలికపాములు పోవాలంటే కాకర గింజల చూర్ణం నీటితో లేక తేనెతో లోనికి తీసుకోవాలి. రెండు లేక మూడుసార్లు తీసుకుంటే ఏలిక పాములు పోతాయి.
* యాంటిఆక్సిడెంట్స్ బాగా కలిగిన కాకరకాయ రోగనిరోధకశక్తిని బాగా పెంచుతుంది.రోజు ఉదయాన్నే కాకరకాయ తాగే అలవాటే ఉండాలి కాని, బ్యాక్టీరియా, ఇన్ఫెక్షన్స్ మనదగ్గరకి రావడానికి కూడా జంకుతాయి.
* బ్యాడ్ కొలెస్టిరాల్ లెవెల్స్ గణనీయంగా తగ్గిస్తుంది కాకరకాయ.LDL Cholesterol బాధితులంతా కాకరికాయను ఆశ్రయిస్తే మంచిది.
* ఒంట్లో టాక్సిన్స్ ని కూడా సులువగా కడిగిపడేస్తుంది కాకరకాయ.అందుకే రోజు పొద్దున్నే కాకరకాయ జ్యూస్ తాగమని చెప్పేది.
* కుక్క కరిచినప్పుడు కాకరకాయను తినిపించి కరిచిన చోట గాయాన్ని కడిగిన తర్వాత కాకర ఆకుల్ని పిండి ఆ రసాన్ని గాయంపైన రాయచ్చు.
* అతిమద్యం వలన్న హ్యాంగోవర్ వస్తే గనుక కాకరకాయ రసం తాగండి చాలు.హ్యాంగోవర్ పారిపోకపోతే అడగండి.

   Politics

   Lifestyle