HomeTelugu lifestyle

గరిక జ్యూస్ యొక్క ఆరోగ్య ప్రయోజనాలు
Published By :  Divya Valluru Image Image
Amazing health benefits of Wheat Grass Juice
Saturday Feb 15, 2020
మీరు బరువు తగ్గాలనకుంటున్నారా అయితే ఉదయాన్నే పరిగడుపున గరిక జ్యూస్ తీసుకుంటే బరువు సులభంగా తగ్గుతారట. ప్రతిరోజు ఉదయం పరగడుపున గరిక జ్యూస్‌ను తీసుకుంటే ఒబిసిటీ సమస్య నుంచి మీకు ఉపశమనం లభిస్తుంది. ఈ జ్యూస్ సేవించడం ద్వారా చురుకుదనం ఏర్పడుతుంది. రక్తహీనత వుండదు. రక్త ప్రసరణ మెరుగ్గా వుంటుంది. ఈ గరిక జ్యూస్ తాగిన రెండు గంటల తర్వాతే ఆహారాన్ని తీసుకోవాలి. 

గరిక జ్యూస్ ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకోండి 

* జలుబు, సైనస్, అస్తమా వ్యాధులకు ఇది చెక్ పెడుతుంది. 
* ఉదర సంబంధిత రుగ్మతలు తొలగిపోతాయి.
* మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో చక్కెర స్థాయిలను ఈ జ్యూస్ నియంత్రిస్తుంది.
* నరాల బలహీనత, చర్మ వ్యాధులను తొలగిస్తుంది. అజీర్తిని మటాష్ చేస్తుంది.
* జీర్ణసమస్యలు ఉన్నవారు బ్రష్ చేసిన తర్వాత గరిక రసం తీసుకుంటే అజీర్తి సమస్యను దూరం చేస్తుంది.
* క్యాన్సర్ కారకాలను నశింపజేస్తుంది.
* నిద్రలేమిని దూరం చేస్తుంది.
* చిగుళ్ల వ్యాధులను దరిచేరనివ్వదు.
* కీళ్ల నొప్పులకు గరిక రసం తొలగిస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 

మరి ఇక పరగడుపున రోజూ గరిక రసాన్ని ఓ గ్లాసుడు తాగేస్తారుగా..!

   Politics

   Lifestyle