HomeTelugu lifestyle

ఉల్లికాడ‌ల‌ను తింటే ఎంత మంచిదో
Published By :  Lasya Raghavaraju Image Image
Health Benefits of Spring Onions; Spring Onion medicinal properties
Thursday Feb 06, 2020
ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అనే సామెత అందరూ వినేఉంటారు. ఉన్నతమైన ఔషధ గుణాలు కలిగిన విలువైన మూలికగా మనం ఉల్లిని పరిగణించవచ్చు. అదేవిధంగా ఉల్లికాడలు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. తక్కువ ధరకే మనకు లభించే ఉల్లికాడలను ఆహారపదార్ధాలలో ఉపయోగించడానికి చాలామంది ఇష్టపడరు. 

పోషకాలు పుష్కలంగా లభించే ఉల్లికాడలను సంప్రదాయ మందుల్లో వాడుతున్నారు. ఇందులో ఉండే  ల్లోని విటమిన్ సి వ్యాధినిరోదక శక్తిని పెంచుతుంది. దీనిలో ఉన్న యాంటీ-బ్యాక్టీరియల్ లక్షణం జలుబు, జ్వరానికి వ్యతిరేఖంగా పోరడడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా ఉల్లికాడలు కొలస్ట్రాల్ స్థాయిలను తగ్గించుకోవడానికి కూడా సహాయపడతాయి. ఉల్లికాడల్లోని ఆరోగ్య ప్రయోజనాలేమిటో చూద్దాం. 

  • ఉల్లికాడల్లో విటమిన్‌ సి, విటమిన్‌ బి2, థయామిన్‌లు సమృద్ధిగా ఉంటాయి. ఇది విటమిన్‌ ఎ, విటమిన్‌ కెని కూడా కలిగి ఉంటుంది. కాపర్‌, ఫాస్పరస్‌, మెగ్నీషియం, 
  • పొటాషియం, క్రోమియం, మాంగనీస్‌, ఫైబర్‌లు దాగి ఉంటాయి. ఉల్లికాడల్ని తరచూ ఆహారంలో తీసుకునే వారికి రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
  • ఉల్లికాడలను విరివిగా తినడంవలన వాడితే రక్తపోటు, ఆస్టియోపోరోసిస్‌ వంటి ఎముక సంబంధిత వ్యాధుల బారిన పడే అవకాశాలు తగ్గుతాయి.
  • ఉల్లికాడలు చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తాయి. కాలేయం చుట్టూ పేరుకొనే అధిక కొవ్వు తగ్గేలా చూస్తాయి.  ఇందులోని సల్ఫర్‌ కాంపౌండ్‌ బ్లడ్‌ ప్రెజర్‌ స్థాయిలను నియంత్రిస్తుంది.
  • ఉల్లికాడల్లో ఉన్న క్రోమియం కంటెంట్‌ మధుమేహ ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఇది బ్లడ్‌ షుగర్‌ స్థాయిలను నియంత్రిస్తుంది. గ్లూకోజ్‌ శక్తిని పెంచుతుంది. 
  • ఉల్లికాడల్లోని యాంటీ బ్యాక్టీరియల్‌ లక్షణం జలుబు, జ్వరానికి వ్యతిరేకంగా పోరాడడానికి సాయపడుతుంది.  ఉల్లికాడల్లోని పెక్టిన్‌(నీటిలో కరిగే కొల్లాయిడల్‌ కార్బోహైడ్రేట్‌) ముఖ్యంగా పెద్దప్రేగు క్యాన్సర్‌ కారకాల్ని తగ్గిస్తుంది.
  • ఉల్లికాడలు రోజూ ఆహారంలో భాగం చేసుకునే వారికి కంటి జబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువ. ఉల్లికాడల్లోని గ్జియాంతిన్‌ అనే పదార్థం కంటిచూపుని మెరుగుపరుస్తుంది. 
  • ఉల్లికాడల్లో లభించే  అల్లసిన్‌ చర్మానికి ఎంతో మంచిది. చర్మం ముడతలు పడకుండా చూస్తుంది.

   Politics

   Lifestyle