HomeTelugu lifestyle

ఇంగువ వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
Published By :  Divya Valluru Image Image
Medicinal Uses and health benefits of Asafoetida aka Hing
Wednesday Jan 22, 2020
వంటకాల్లో విరివిగా ఉపయోగించే ఇంగువ తింటే చాలా లాభాలున్నాయంటున్నారు ఆయుర్వేద నిపుణులు. అయితే ఘాటైన వాసన కలిగిన ఇంగువను తినడానికి చాలామంది ఇష్టపడరు. ఇంగువను తినడానికి చాలా ఇబ్బందిగా ఫీలవుతూ ఉంటారు. యాంటీ బయాటిక్, యాంటీ వైరల్, యాంటీ ఇన్‌ప్లమేటరీ లక్షణాలు కలిగిన ఇంగువ తింటే మన శరీరంలో మనకు తెలియకుండానే ఎన్నో ఉపయోగాలు కలుగుతాయంటున్నారు ఆయుర్వేద నిపుణులు. 

అవేంటో ఇక్కడ తెలుసుకుందా...

  • ఇంగువను ప్రతిరోజూ తీసుకుంటే గ్యాస్, కడుపు ఉబ్బరం వంటివి సమస్యలు తగ్గుముఖం పడతాయి. 
  • రోజూ భోజనంలో ఇంగువ ఉండేలా చూసుకుంటే జీర్ణశక్తి మెరుగుపడుతుంది. నరాలను ఉత్తేజపరుస్తుంది.
  • ఇంగువను నీళ్లల్లో కరిగించి ముక్కులో 3 చుక్కలు వేసుకుని నస్యంగా పీలిస్తే పార్శ్వపు నొప్పి తగ్గుతుంది. 
  • తలనొప్పి అధికంగా ఉన్నప్పుడు వేడి నీటిలో ఇంగువ పొడి కలుపుకుని తాగితే త్వరగా తగ్గుతుందట. 
  • బెల్లంతో ఇంగువను తీసుకుంటే మహిళలకు నెలసరి సమయంలో వచ్చే పొత్తి కడుపు నొప్పి తగ్గుతుందట. 
  • అధిక రక్తపోటు ఉన్నవారికి ఇంగువ బాగా సహాయపడుతుంది.

   Politics

   Lifestyle