HomeTelugu lifestyle

కలబందతో చర్మ సౌందర్యం మీ సొంతం
Published By :  Lasya Raghavaraju Image Image
Amazing skin care remedies with Aloe Vera gel
Wednesday Jan 08, 2020
నేటి  కాలంలో  మన  జీవన శైలిలో కాలుష్యం బారిన పడకుండా ఉండడం ఎవరికీ సాధ్యపడడం లేదు. కాలుష్యం బారిన పడి చర్మం పాడితే మహిళలు తెగ బాధపడిపోతుంటారు. తమ ముఖ సౌదర్య పరిరక్షణ కోసం మార్కెట్‌లో లభించే వివిధ రకాల క్రీమ్‌లను వాడుతుంటారు. అయితే వాటివలన ముఖ చర్మ సౌందర్యంలో పెద్దగా మార్పు కనిపించక పోవడంతో దిగాలు పడుతుంటారు. అయితే, ఒక్క పైసా ఖర్చు లేకుండా చర్మ సౌందర్యాన్ని పెంపొందించే సాధనంగా కలబంద పని చేస్తుందనే విషయాన్ని వారు మరిచి పోతారు.

మన పెరటిలో పెరిగే కలబంద చెట్టును మన చర్మం పై రాసి ఒక 20నిమిషాల పాటు ఉంచి గోరువెచ్చని నీటితో కడుకుంటే మీ నిగారింపు మీ చేతిలోనే. కలబంద ఆకుల్లో నీటిని పీల్చుకునే గుణం అధికంగా ఉంటుంది. కలబంద రసాన్ని ముఖానికి దట్టిస్తే చర్మం ప్రకాశవంతంగా తయారవుతుంది.  కలబంద రసంలో ముల్తానీ మట్టి లేక చందనపు పొడి కలుపుకుని ముఖంపైనున్న మొటిమలకు పూస్తే మొటిమలు ఒక్క రోజులో కనిపించకుండా పోతాయంటున్నారు. శరీర చర్మం కాలిపోతే కలబంద రసాన్ని కాలిన గాయాలపై పూతలా పూస్తే గాయాలు కొన్ని రోజుల్లోనే మటుమాయమవుతాయని చెపుతున్నారు ఆరోగ్య నిపుణులు. 

ఒకవేళ మీ ఇంటి పెరటిలో కలబంద దొరకట్లేదు అంటే..మార్కెట్ లో నేడు ఎన్నో రకాల కలబందలు పతంజలి జెల్ ,ఆలోవీర జెల్ అనే పేర్లతో  అందుబాటులో లభిస్తున్నాయి..వాటిని కూడా ఉపయోగించవచ్చు.. ఏది వాడిన ఒక వారం పాటు మాత్రం వాడితేనే ఫలితం సుమా.. అంతే కాదండి కలబందను చక్కెరతో కలిపి తింటే ఒంట్లో ఉండే వేడి వెంటనే కరిగిపోతుంది.

   Politics

   Lifestyle