HomeTelugu lifestyle

రోజూ ఉసిరి జ్యూస్ తాగడం వలన కలిగే లాభాలు
Published By :  Divya Valluru Image Image
Amazing benefits of Amla Juice for Skin, Hair and Body
Tuesday Dec 24, 2019
చలికాలంలో విరివిగా లభించే ఉసిరికాయలను రోజు తినడం వలన మన శరీరానికి అనేక రకాల ఆరోగ్యకరమైన ఫలితాలు లభిస్తాయి. ఉసిరిలో యాంటీయాక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయ, కావున ఉసిరిని రోజు తినడం వలన పలు అనారోగ్య సమస్యలకు చక్కని ఔషధం లాగా పనిచేస్తుంది. కొంచెం పుల్లగా ఒగరుగా ఉండే ఉసిరికాయను తినలేని వారు జ్యూస్‌ లా కూడా తీసుకోవచ్చు. ఉసిరి జ్యూస్ నిత్యం తాగడం వల్ల ఇంకా ఏయే ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందామా.

* విటమిన్ సీ లోపం రాకుండా చూసుకోవచ్చు
* రక్తంలో హిమోగ్లోబిన్‌, ఎర్రరక్తకణాలను వృద్ధి చేసి, రక్తాన్ని శుద్ధి చేసే గుణం ఉసిరికి ఉంది. 
* రోగనిరోధక శక్తి పెరుగుతుంది
* దగ్గు,జలుబు,ఫ్లూ జ్వరాలను తగ్గిస్తుంది
* సైన‌స్‌, ఆస్త‌మా వంటి శ్వాస‌కోశ స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది.
* ఉసిరి రసాన్ని తాగితే ఆహారం జీర్ణమవుతుంది
* రక్తం శుద్ధి అవుతుంది. దీంతో గుండె జబ్బులు కూడా రాకుండా ఉంటాయి. 
* చక్కెరవ్యాధి ఉన్నవారు రోజూ ఉసిరికాయ జ్యూస్‌ను తీసుకుంటే మధుమేహం అదుపులో ఉంటుంది.
* చ‌ర్మం కాంతివంతంగా మారుతుంది. చ‌ర్మానికి మృదుత్వం చేకూరుతుంది.