HomeTelugu lifestyle

జామ ఆకులలో ఉండే ఔషద గుణాలు
Published By :  Divya Valluru Image Image
Guava Leafs health benefits, Nutrition Facts
Monday Dec 16, 2019
విట‌మిన్ సి స‌మృద్ధిగా లభించే జామపండును తినటానికి ఇష్టపడని వారు ఎవరు ఉండరు. ఓ ఆరెంజ్ తింటే వచ్చే సీ విటమిన్ కంటే డబుల్ సీ విటమిన్ జామకాయను తింటే వస్తుంది.  జామపండులోనే కాదు జామఆకుల్లో కూడా మనకు తెలియని అనేక ఔషద ప్రయోజనాలున్నాయి. యాంటీ ఇన్ల్ఫ‌మేటరీ, యంటీ ఆక్సిడెంట్ గుణాలను మరియు యాంటీ బ్యాక్టీరియల్ గుణాలను కలిగి ఉన్న జామ ఆకుల వ‌ల్ల శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. 

జామ ఆకులతో అద్భుత‌మైన ప్రయోజనాలు 

  • రక్తంలో చక్కెర శాతం అధికం కాకుండా జామ ఆకులు నియంత్రిస్తాయి. 
  • జామాకులతో చేసిన టీ తాగటం వల్ల శ్వాసకోశ సంబంధమైన సమస్యలు పోతాయి.
  • జామ ఆకులు డయోరియా, క్యాన్సర్ వంటి సమస్యలను గ్రేట్ గా నివారిస్తాయి.
  • జామకాయ జ్యూస్ కాలేయానికి ఒక మంచి లివర్ టానిక్ వంటిది. ఈ జ్యూస్ తీసుకొన్నప్పుడు. ఎలాంటి దుష్ప్ర‌భావ‌లు లేకుండా ఇది బ్లడ్ కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది.
  • క్యాన్సర్ కు జామ ఆకులు దివ్యౌషధంగా పనిచేస్తాయి. క్యాన్సర్ కణాల సంఖ్య పెరగకుండా నిరోధించే గుణాలున్నాయి.
  • నిద్రలేమి సమస్యతో బాధపడేవారు జామ ఆకు కషాయాన్ని తాగడం వల్ల మంచి నిద్రపట్టేలా చేస్తుంది. 
  • జామ ఆకు రసం జీర్ణవ్యవస్థ తీరుని మెరుగుపరుస్తుంది. మలబద్దక సమస్యను తగ్గిస్తుంది.
  • డేంగ్యూతో బాధపడే వారికి ఈ జామ ఆకుల  జ్యూస్ ఔషధం ప‌ని చేస్తుంది. శరీరంలో ఎలాంటి క్రిములనైనా నాశనం చేస్తుంది. 
  • జామ ఆకు టీలో ఉండే విటమిన్ సి చర్మ ఆరోగ్యానికి స‌హాయ‌ప‌డుతుంది.