HomeTelugu lifestyle

జుట్టు ఊడిపోతుందా అయితే ఈ చిట్కా పాటించండి
Published By :  Divya Valluru Image Image
Coconut and Hibiscus oil to cure Hairfall super remedy
Monday Dec 09, 2019
ఈ రోజుల్లో జుట్టు రాలిపోవడం పెద్ద సమస్యగా మారిపొయింది. రోజుకు 100 నుండి 150 వెంట్రుకలు రాలడం మామూలేనని కొంతమంది డాక్టర్లు చెపుతున్నారు. కానీ కొంతమందికి మాత్రం తలలో దువ్వెన పెట్టగానే పెచ్చులు పెచ్చులుగా జుట్టు రాలిపోతుంది. యువతులు, మహిళలు కూడా జుట్టు రాలే సమస్యతో భయపడుతుంటారు.  మగవాళ్లయితే బట్టతల వస్తుందేమో అని టెన్షన్ పడుతుంటారు.  కొంతమందికి  

ఇలా  జుట్టు రాలే సమస్యతో బాధపడేవాళ్లు ఇంట్లోనే అద్భుతమైన చిట్కా ఫాలో అయ్యారంటే.. మీ జుట్టు ఊడిపోవడం తగ్గడమే కాదు.. జుట్టు ఇంకా ఒత్తుగా పెరుగుతుంది. దీనికి మీరు ఖర్చు కూడా ఏమి పెట్టక్కర్లేదు. కొంచెం కొబ్బరినూనె తీసుకోండి. ఆ కొబ్బరి నూనెలో మందార పూలను వేయండి. రెండింటినీ బాగా మరగబెట్టండి. తర్వాత చల్లార్చండి. ఆ నూనెను ప్రతి రోజు తలకు పట్టించండి. ఇలా క్రమం తప్పకుండా కొన్ని రోజులు ఈ నూనెను వాడితే జుట్టు ఊడిపోవడం తగ్గడమే కాకుండా జుట్టు ఒత్తుగా కూడా పెరుగుతుందట.

ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే ఈ చిట్కాను మీ ఇంట్లో పాటించండి.