HomeTelugu lifestyle

సీతా ఫలంతో ఆరోగ్య ప్రయజనాలు ఎన్నో
Published By :  Ravi Koneri Image Image
Interesting health benefits of Custard Apple
Thursday Oct 17, 2019
వర్షాకాలంలో విరివిగా దొరికే సీతాఫలం రుచిని ఇష్టపడనివారు ఎవరూ ఉండరు. పోషక విలువలు అధికంగా ఉండే సీతాఫలం పళ్ళు వర్షాకాలం ప్రారంభమవగానే మార్కెట్లో కనబడతాయి.  ఇది తిన్న వెంటనే శక్తిని ఇస్తుంది. వీటిలో సి విటమిన్‌తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా లభిస్తాయి. ఇంకా ఇందులోని ఐరన్, విటమిన్ సి, పాస్ఫరస్, మెగ్రీషియం అధికంగా ఉండి ఆరోగ్యానికి మేలు చేస్తుంది.  

సీతాఫలంతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు :

  • సీతాఫలం తింటుంటే గుండె సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం ఉంటుంది. 
  • గుండె కొట్టుకునే తీరును సీతాఫలం క్రమబద్ధీకరిస్తుంది.
  • సీతాఫలం రోజు తినడం వల్ల విటమిన్‌ సి శరీరానికి సమృద్ధిగా లభిస్తుంది.
  • రక్తంలోని ఇన్సులిన్‌ శాతాన్ని క్రమబద్ధీకరిస్తుంది, గ్లూకోజ్‌ శాతాన్ని అదుపులో ఉంచుతుంది.
  • ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్‌ కారకాలని దూరం చేస్తాయి.
  • రక్తహీనత బారిన పడకుండా సీతాఫలం కాపాడుతుంది.
  • కండరాలను దృఢంగా ఉంచే మెగ్నీషియం పోషకాన్ని అందిస్తుంది.
  • సీతాఫలంలో ఉండే కాపర్‌ రక్తంలో హిమోగ్లోబిన్‌ శాతాన్ని పెంచుతుంది.
  • ఒక సీతాఫలంలోనే వెయ్యి మిల్లీ గ్రాముల కాపర్‌ లభిస్తుంది.
  • ఇంకా దీనిలో లభించే డయిటరీ పీచు జీర్ణ వ్యవస్థ పనితీరు బాగుండేలా చూస్తుంది.
  • విటమిన్‌ ఎ కలిగి ఉండటంతో కంటిచూపు బాగుండేందుకు తోడ్పడుతుంది.
  • యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు ఈ కాలంలో వేధించే సమస్యలతో పోరాడతాయి.
  • సీతాఫలం తినడంవలన ఇన్ఫెక్షన్లు దరి చేరవు. గాయాలు కూడా త్వరగా మానుతాయి
  • సీజన్లో రోజూ వీటిని తినడం వల్ల కడపులో మంట తగ్గుతుంది
  • జీర్ణశక్తి పెంపొందుతుంది. ఎముకలు దృఢంగా మారతాయి
  • కండరాలు, నరాల బలహీనతను అధిగమించడానికి సీతాఫలం తోడ్పడుతుంది

   Politics

   Lifestyle