HomeTelugu lifestyle

ప్లేట్‌ లెట్స్‌ను పెంచే ఆహార పదార్థాలు
Published By :  Lasya Raghavaraju Image Image
Foods to increase platelet count during Dengue fever
Friday Sep 13, 2019
డెంగ్యూ మహమ్మారి తెలుగు రాష్ట్రాల ప్రజలను వణికిస్తోంది. గత రెండు వారాలుగా డెంగ్యూ జ్వరంతో బాధపడేవాళ్ళ సంఖ్య బాగా పెరిగింది. ఆసుపత్రులన్నీ డెంగ్యూ రోగులతో నిండిపోతున్నాయి. తెలంగాణ లో అయితే పరిస్థితి మరీ దారుణంగా ఉంది. డెంగ్యూ లక్షణాల్లో ప్లేట్ లెట్స్ తగ్గిపోవడం చాలా దారుణమైనది. 

సాధారణంగా మన రక్తంలో  1,50.000 నుండి 4.50.000 వరకు ప్లేట్ లెట్స్ ఉంటాయి. ఇవి మనకి ఏదైనా గాయం వల్ల రక్తం బయటకి వచ్చినప్పుడు ఆ రక్తాన్ని గడ్డకట్టేలా, గాయం తొందరగా తగ్గిపోయేలా పని చేస్తాయి.  మన రక్తంలో ప్లేట్ లెట్స్ స్థాయి తగ్గిపోవడం వల్ల.. శరీరం నిస్సత్తువకు లోనవుతుంది. అంతేకాదు.. కనీసం కూర్చోవడానికి, నిలబడటానికి, నడవటానికి కూడా శరీరం సహకరించదు. 

డెంగ్యూ ప్రస్తుతం వేగంగా వ్యాపిస్తుండటం వల్ల.. ప్లేట్ లేట్స్ అధికంగా లభించే ఆహార పదార్థాల గురించి తెలుసుకోవడం చాలా అవసరం. 

  • ముఖ్యంగా బొప్పాయి తీసుకోవడం వల్ల ప్లేట్ లెట్స్  సంఖ్య పెరుగుతుంది. బ్లడ్ లెవల్ తక్కువగా ఉన్నపుడు బొప్పాయి తీసుకోవాలి.
  • క్యారెట్ వంటి దుంపలను తీసుకోవడం వల్ల ప్లేట్ లెట్స్ సంఖ్య పెరుగుతుంది. కనీసం వారానికి రెండు సార్లైనా వీటిని తీసుకోవాలి.
  • వెల్లుల్లి శరీరంలో నేచురల్ గా ప్లేట్ లెట్స్ పెంచుకోవడానికి చాలా ఉపయోగకరం.
  • విటమిన్ కె ఉన్న ఆకుకూరలు తీసుకోవడం వల్ల కూడా ప్లేట్ లెట్స్  సంఖ్య పెరుగుతుంది.
  • ప్లేట్ లెట్స్  పెంచడంలో బీట్ రూట్ ఉపయోగపడుతుంది.
  • దానిమ్మ వంటి ఎర్రగా ఉన్న అన్ని రకాల పళ్లల్లో ఐరన్ ఉంటుంది. ఇది కూడా ప్లేట్ లెట్స్  ను పెంచడానికి ఉపయోగపడుతుంది
  • ఐరన్ అధికంగా ఉన్నపండ్లలో మరొకటి ఆప్రికాట్ . రోజుకు రెండు సార్లు ఆప్రికాట్ ను తినడం వల్ల ప్లేట్లెట్ లెవల్స్ పెంచుకోవచ్చు.
  • రుచికరమైన డ్రై ఫ్రూట్స్ లో 30శాతం ఐరన్ ఉంటుంది. ఒక గుప్పెడు ద్రాక్ష తినడం వల్ల ప్లేట్లెట్ లెవల్స్ ను నేచురల్ గా పెంచుతుంది.
  • ఖర్జూరలో కూడా ఐరన్స్ తో పాటు న్యూట్రిషియన్స్ అధికంగా ఉంటాయి.

   Politics

   Lifestyle