HomeTelugu lifestyle

ఈ చిట్కాలు పాటిస్తే ముఖంపై జిడ్డు పోతుంది
Published By :  Dhanunjaya Vallivedu Image Image
Home Remedies for Oily Skin, Oily skin care tips, Tips for oily skin
Thursday Nov 15, 2018
చాలా మందికి ముఖంపై జిడ్డు కారడం సహజం. ఎంత అందంగా ఉన్నా జిడ్డు కారుతుంటే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. ఒత్తిడీ, గర్భనిరోధక సాధనాలూ, అతిగా సౌందర్యోత్పత్తులు వాడటం, వంశపారంపర్యం వల్లా ముఖం జిడ్డుగా మారుతుంది. ఇలాంటి వారికి ఎప్పుడూ ముఖంపై నూనె కారినట్టు ముఖం కొద్దిగా నల్లగా మారినట్టు తెలుస్తుంది. ఇలాంటి వారు ముఖ్యం కాంతివంతంగా కనిపించేలా చేసుకోవడానికి ఇంటిలోనే కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. 

1. రెండు టేబుల్‌ స్పూన్ల ఓట్‌మిల్‌ పొడిలో కోడిగుడ్డులోని తెల్లసొన, టీ స్పూన్‌ నిమ్మరసం కలిపి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి. పూర్తిగా ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. వారానికి రెండు సార్లు క్రమం తప్పకుండా ఈ ప్యాక్‌ వాడుతుంటే చర్మం నిగారిస్తుంది.

2. ఆపిల్ పండ్ల‌ పై పొట్టును చాలా మంది పడేస్తుంటారు. అలా కాకుండా ఈ పొట్టును మిక్సీలో వేసి పేస్ట్ చేయాలి. దీనికి ఒక టేబుల్‌ స్పూన్‌ తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని ముని వేళ్లతో ముఖంపై రాస్తూ.. ఐదు నిమిషాల పాటు మర్దనా చేయాలి. ఆ తర్వాత మిగిలిన మిశ్రమాన్ని ప్యాక్‌లా వేయాలి. 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగేస్తే.. జిడ్డు మాయం అవుతుంది.

3. ఒక స్పూన్‌ టమాటో గుజ్జులో అర స్పూన్‌ తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 15 నిమిషాల తరవాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి.

4. రెండు టీ స్పూన్ల ముల్తానీ మట్టి, రెండు టీ స్పూన్ల రోజ్‌ వాటర్‌ కలిపి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని బ్రష్‌తో ముఖానికి అప్లై చేసి ఇరవై నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడిగేయాలి.

5. అరకప్పు పెసరపిండిలో సరిపడా పెరుగు, కాస్త నీళ్లు కలిపి తయారు చేసిన మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఆరాక చల్లనినీటితో కడిగినట్లైతే జిడ్డు చర్మాన్ని తాజాగా, తేటగా మారుస్తుంది. దీని తరవాత సబ్బు రుద్దుకోకూడదు. 

6. నాలుగైదు బాదంపప్పుల్ని రాత్రంతా నానబెట్టి మర్నాడు మెత్తగా చేసి ఆ మిశ్రమంలో కాస్త తేనె కలిపి ముఖానికి పట్టించి ఇరవై నిమిషాలయ్యాక కడిగేయాలి. జిడ్డు చర్మతత్వానికి మంచి ప్యాక్ ఇది.

   Politics

   Lifestyle