HomeTelugu lifestyle

మొటిమలు పోవడానికి ఈ చిట్కాలు పాటించండి
Published By :  Dhanunjaya Vallivedu Image Image
Best Home Remedies for Pimples and Acne
Thursday Nov 15, 2018 image: Jesus Daily
కొంతమందికి యవ్వన ప్రాయంలో మొటిమలు రావడం సహజమే కానీ అవి విపరీతంగా వస్తే చాలా సమస్యలు తలెత్తుతాయి. మొటిమలు సాధారణంగా 12 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల వరకూ రావడం జరుగుతుంది. మొటిమలు రాకుండా అనేక క్రీములు వాడుతుంటారు.  ఇవి రావటానికి వత్తిడి, హార్మోన్ల స్థాయిల్లో మార్పులు, స్టిరాయిడ్ల వంటి మందులు వాడటంతో మొటిమలు వచ్చే అవకాశం వున్నది. కనుక ఈ మాదిరి సమస్య ఉన్న వారు వత్తిడిని తగ్గించుకోవటం చాల మంచిది. మొటిమలతో బాధపడే వారికి ఆ సమస్య నుంచి బయటపడేందుకు ఈ సుల‌భ‌మైన చిట్కాలు పాటిస్తే మొటిమలు మటుమాయం అవుతాయి.

1. బయటకు వెళ్ళి వచ్చినప్పుడు దుమ్ము చేరకుండా తప్పకుండా చల్లటి నీళ్ళతో ముఖం కడుక్కోవాలి. ఇలా చేయ‌డం వల్ల ముఖంపై చ‌ర్మ రంధ్రాల్లో దుమ్ము పేరుకుపోకుండా ఉంటుంది.

2. వేప ఆకులను నీళ్ళలో ఉడికించి, ఆ నీటిని బకెట్ నీళ్ళలో కలుపుకుని స్నానం చేస్తే ఎంతో మంచిది. ఇలా చేయడంవల్ల మొటిమలే కాదు అనేక రకాల చర్మ వ్యాధులు కూడా తగ్గుతాయి.

3. ముల్తాని మట్టిలో రోజ్ వాటర్ కలిపి ముఖానికి ప్యాక్ వేసుకుంటే ఫలితం కనిపిస్తుంది.

4. శొంఠి, లవంగాలు నీటితో నూరి లేపనం తయారు చేసి ముఖంపై తరుచూ రాస్తూ ఉంటే మొటిమలు తక్షణమే తగ్గుముఖం పడతాయి.

5. మొటిమ గనక చితికినట్లయితే దానిమీద ఐస్ క్యూబ్ ఉంచి సుతిమెత్తగా రుద్దినట్లయితే అందులో ఉన ర‌సి అంతా వచ్చేస్తుంది. చిటికెడు పసుపు ముఖానికి రాసి, కొద్దిసేపటి తర్వాత ముఖం కడుక్కోవడం ద్వారా మొటిమలను తగ్గించుకోవచ్చు.

6. ఒక గిన్నె తీసుకుని అందులో కొద్దిగా ఉల్లిరసం వేసి.. అనంతరం దాంట్లో కొంచెం తేనే కలుపుకుని ఈ మిశ్రమాన్ని మొటిమలు, వాటి మచ్చలపై రాసి.. కొద్దిసేపు మర్దన చేసుకోవాలి. గంటసేపు అలాగే వుంచుకోవాలి. ఆ తర్వాత సున్నిపిండితో కడిగితే మంచి ఫలితం లభిస్తుంది.

7. గులాబీ రేకులు, బచ్చలి ఆకులు నూరి ముఖానికి రాసుకుని అర్థ గంట తర్వాత చల్లని నీటితో కడగాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మొటిమల నుంచి ఉపశమనం పొందవచ్చు.

8. ఒక పాత్రలో కొద్దిగా శెనగపిండి తీసుకుని, అందులో కాస్త పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. ఒక పేస్ట్‌లా ఈ మిశ్రమాన్ని తయారు చేసుకున్న తర్వాత దాన్ని ముఖానికి పట్టించాలి. 20 నిమిషాలపాటు అలాగే ఉంచి తర్వాత, గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడిగేయాలి. ఇలా తరుచుగా చేస్తే.. మొటిమలు తగ్గుతాయి.

   Politics

   Lifestyle