HomeTelugu lifestyle

గ్రీన్‌ టీతో ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు చెక్
Published By :  Divya Valluru Image Image
Green tea and lung cancer, How Green Tea May Thwart Lung Cancer
Friday Oct 05, 2018 Image: Selfhacked
గ్రీన్ టీ తాగడం వలన మనకు అనేక ప్రయోజనాలు ఉన్నాయి. గ్రీన్ టీ లో మనకు యాంటీఆక్సిడెంట్లు, కార్బోహైడ్రేట్‌, ఖనిజాలు లభిస్తాయి. విటమిన్‌ ఎ,బి,సి,ఇ,కె కూడా ఉంటాయి. కాపర్‌, ఐరన్‌,జింక్‌, మాంగనీస్‌ టీలో లభిస్తాయి. ఇందులో కెఫిన్‌, పాలిఫినాల్స్‌ కూడా ఉంటాయి. గ్రీన్ టీ త్రాగడం శరీరారోగ్యానికి కూడా మంచిది. గ్రీన్ టీలో ఔషధ గుణాలు చాలా ఎక్కువుగా ఉన్నాయి. పాలీఫినాల్స్‌, అమైనో ఆమ్లాలు, విటమిన్ల కారణంగా ఈ ఆకు ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు కారణమయ్యే కణాలను 80 శాతం నివారిస్తుందని లండన్‌కి చెందిన స్వాన్‌సీ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు పేర్కొంటున్నారు. 

ఇందుకోసం వాళ్లు ఆ ఆకుల్లోని ఔషధాలను నానోపార్టికల్స్‌ రూపంలో సేకరించి క్యాన్సర్‌కణాల మీద ప్రయోగించి చూడగా అవన్నీ దాదాపు చనిపోయాయట. పైగా ఇతర క్యాన్సర్‌ మందులతో పోలిస్తే గ్రీన్ టీకి చేసే తేయాకు నుంచి సేకరించిన పదార్థాల వల్ల ఎలాంటి దుష్ఫలితాలూ తలెత్తవని కూడా తేలింది. ఇతర రసాయన పదార్థాలతో పోలిస్తే దీనికయ్యే ఖర్చూ తక్కువ. కాబట్టి త్వరలో తేయాకును క్యాన్సర్‌ మందుగా రూపొందించేందుకు సదరు పరిశోధకులు ప్రయత్నిస్తున్నారు.

   Politics

   Lifestyle