HomeTelugu gossips

ఎన్టీఆర్ హాలీవుడ్‌ సినిమా దర్శకుడు ఎవరంటే
Published By :  Lasya Raghavaraju Image Image
NTR to make his Hollywood debut with Night Shyamalan movie
Tuesday Feb 23, 2021
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ మూవీలో కొమురం భీమ్ పాత్రలో నటిస్తుండగా ఈ సినిమా విడుదలైతే ఎన్టీఆర్ కు పాన్ ఇండియా ఇమేజ్ రావడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. రామ్ చరణ్ అల్లురిగా నటించనున్న ఈ సినిమాకి రాజమౌళి దర్శకుడు కాగా ఈ ఏడాది అక్టోబర్ 13న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా తరువాత ఎన్‌టీఆర్ చేయనున్న సినిమాపై అనేక ఊహాగానాలు వస్తున్నాయి. ఈ క్రమంలో దర్శకులుగా ప్రశాంత్ నీల్, అట్లీ, లోకేష్ కనగరాజ్ ఇలా చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి. 

తాజాగా మరో వార్త తెగ హల్‌చల్ చేస్తోంది. యంగ్ టైగర్ ఎన్‌టీఆర్ తన తదుపరి చిత్రం తరువాత హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమవుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రముఖ హాలీవుడ్ డైరెక్టర్ మనోజ్ నైట్ శ్యామలన్ జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా తెరకెక్కించడానికి ఆసక్తిగా ఉన్నారని సినీ సర్కిల్స్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. హాలీవుడ్‌లో ద సిక్స్త్ సెన్స్, అన్ బ్రేకబుల్, గ్లాస్ వంటి  బ్లాక్ బస్టర్ సినిమాలను శ్యామలన్ తెరకెక్కించారు. 

ఈ వార్త ఎంతవరకు నిజమనేది తెలీదు కానీ ఇది నిజం కావాలని ఎన్‌టీఆర్ అభిమానులు కోరుకుంటున్నారు. మరి ఇది నిజమవుతుందా లేదా అనేది తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.

   Politics

   Lifestyle