HomeTelugu gossips

ఎన్టీఆర్ తో పోరాడనున్న విజయ్ సేతుపతి
Published By :  Lasya Raghavaraju Image Image
Vijay Sethupathi to share screen with NTR in Trivikram movie
Tuesday Feb 23, 2021
యంగ్ టైగర్ ఎన్‌టీఆర్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమాలో గొండ్రు బెబ్బులు కొమరం భీం పాత్రలో నటిస్తున్నాడు. రామ్ చరణ్ అల్లురిగా కనిపించనున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం అక్టోబర్ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.   సినిమా తరువాత ఎన్‌టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో అయినను పోయిరావలె హస్తినకు అనే సినిమాను ఎన్టీఆర్ చేయనున్నాడు. ఏప్రిల్ నేలనుంచి సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాలో నటీనటుల ఎంపిక జరుగుతోంది.

తాజాగా ఈ సినిమా గురించిన అప్డేట్ ఒకటి చిత్రవర్గాల్లో వినిపిస్తోంది. ఈ సినిమాలో విలన్ గా విజయ్ సేతుపతి ప్రతి నాయకుడి పాత్రలో కనిపిస్తాడని తెలుస్తోంది. ఉప్పెన చిత్రంలో రాయణం పాత్రలో నటించి మెప్పించిన సేతుపతి అయితే ఎన్టీఆర్ సినిమాకి తమిళంలో కూడా మంచి ఓపెనింగ్స్ వస్తాయనే ఉద్దేశంతో త్రివిక్రమ్ భావిస్తున్నట్లు సమాచారం. ఇది ఎంతవరకు నిజమో తెలియదు గాని బిగ్ స్క్రీన్ పై ఎన్టీఆర్ – విజయ్ సేతుపతి లాంటి టాలెంటెడ్ స్టార్స్ కొట్టుకుంటే మాత్రం మామూలుగా ఉండదని చెప్పవచ్చు. 

ఉప్పెన సినిమాతో సేతుపతి క్రేజ్ పై ఫుల్ క్లారిటీ వచ్చేసింది. ఇక తెలుగు దర్శకులు సేతుపతిని గట్టిగా వాడుకోవాలని ఫిక్స్ అయ్యారు. విలన్ పాత్రలను చేయించడానికి ట్రై చేస్తున్నారు. అయితే పాత్ర నచ్చితే కానీ సేతుపతి ఒక పట్టాన సినిమా ఒప్పుకోవట్లేదని మరో టాక్ నడుస్తోంది.

   Politics

   Lifestyle