HomeTelugu gossips

దిల్ రాజు రెండో పెళ్లి పై ఆసక్తికర అప్డేట్
Published By :  Lasya Raghavaraju Image Image
Dil Raju to tie the knot for second time after Ugadi
Friday Feb 14, 2020
స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ టాలీవుడ్ అగ్ర నిర్మాతలలో ఒకరిగా కొనసాగుతున్న దిల్ రాజు మళ్ళీ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వినిపిస్తున్న సమాచారం ప్రకారం దిల్ రాజు తన కుటుంబనికి దగ్గర మనిషి అయిన పెళ్లికాని ముప్పై ఏళ్ల స్త్రీ ని పెళ్లి చేసుకోనున్నాడట. త్వరలోనే దీనిపై అఫీషియల్ కన్ఫర్మేషన్ కూడా బయటికి రానుందని వార్తలు వినిపిస్తున్నాయి.

దిల్ రాజు భార్య అనిత దాదాపు రెండేళ్ల క్రితం అనారోగ్యంతో మరణించిన సంగతి తెలిసిందే. దిల్ రాజు కుమార్తె సైతం పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యారు. అనిత గారు చనిపోయిన తర్వాత పూర్తిగా ఒంటరి అయిపోయాడు రాజు. సినిమాలతో కాలక్షేపం చేస్తున్నా కూడా తోడు కావాలని సన్నిహితులు నచ్చచెప్పడంతో ఈయన మరో పెళ్లి చేసుకోడానికి ఒప్పుకున్నాడని తెలుస్తుంది.  అయితే దిల్ రాజు చేసుకోబోయే స్త్రీ కి సినిమా పరిశ్రమ తో ఎలాంటి సంబంధం లేదని తెలుస్తుంది. 

ఈ పెళ్లి కూడా ఎలాంటి సందడి లేకుండా సైలెంట్ గా జరగబోతుందని తెలుస్తుంది. మరి రాజు గారి రెండో పెళ్లి గురించిన వాస్తవాలు తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.

సినిమాల విషయానికి వస్తే ‘జాను’ నిర్మించి సక్సెస్ బాటలో పయనిస్తున్న దిల్ రాజు నిర్మిస్తున్న ‘వి’ సినిమా ఉగాది సందర్భంగా రిలీజ్ చేయనున్నారు. ఇక పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న పింక్ రీమేక్ ని కూడా దిల్ రాజే తెరకెక్కిస్తున్నారు. వీవీ వినాయక్ హీరోగా పరిచయం అవుతున్న సినిమాకు కూడా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

   Politics

   Lifestyle