HomeTelugu gossips

రేణూ, పిల్లల కోసం ఇల్లు కొన్న పవన్ కళ్యాణ్
Published By :  Lasya Raghavaraju Image Image
Pawan Kalyan bought a house for second wife Renu and kids
Thursday Feb 13, 2020
జనసేనాని, పవర్ స్టార్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించిన ఒక వార్త ఇండస్ట్రీ సర్కిల్స్, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన రెండో భార్య, పిల్లల కోసం హైదరాబాద్ నగరంలో ఓ లగ్జరీ అపార్ట్ మెంట్ ని కొన్నారట.

పవన్ రెండో భార్య రేణుదేశాయ్ కొద్దిరోజుల క్రితం పూణే నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారని తెలుస్తోంది. పిల్లలు పెద్దవారు కావడం, వారి భవిష్యత్ ను తీర్చి దిద్దాల్సిన బాధ్యత వుండడంతో, పిల్లలు తండ్రి పవన్ కు దగ్గరగా వుండాల్సిన అవసరం వుందని రేణు దేశాయ్ హైదరాబాద్ షిప్ట్ అయ్యారని టాక్. పవన్ కొడుకును ఎప్పటికైనా హీరోను చేయాలన్న కోరిక రేణు కు వుందని తెలుస్తోంది.  ఇలా హైదరాబాద్ షిఫ్ట్ అయిన రేణు, ఆమె పిల్లల కోసం పవన్ నే ఓ ఫ్లాట్ ను కొన్నారని టాక్ వినిపిస్తోంది. నటుడు మురళీమోహన్ కు చెందిన ఓ విలాసవంతమైన వెంచర్ లో అత్యంత ఖరీదైన ఫ్లాట్ వుందని టాక్ వినిపిస్తోంది. మరి ఇందులో ఎంతవరకు వాస్తవముందో తెలీదు గాని న్యూస్ మాత్రం బాగా వైరల్ అవుతోంది.

ఇక సినిమాల విషయానికి వస్తే, పవన్ ప్రస్తుతం పింక్ రీమేక్ షూటింగ్ పనులతో బిజీగా ఉన్నాడు. అలాగే పవన్ దర్శకుడు క్రిష్ తో కూడా ఒక సినిమా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు కాకుండా గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ తో ఒక సినిమాకి పచ్చజెండా ఊపాడు.

   Politics

   Lifestyle