HomeTelugu gossips

నితిన్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి పేరు శాలిని ; పెళ్లి ఎక్కడంటే
Published By :  Lasya Raghavaraju Image Image
Nitin to enter wedlock with Shalini; Wedding to be held in Dubai
Tuesday Jan 14, 2020
త్వరలో భీష్మ చిత్రంతో మనముందుకు రానున్న 36 ఏళ్ళ నితిన్ పెళ్లికి సంబంధించి పలు వార్తలు సోషల్ మీడియాలో, టాలివుడ్ సర్కిల్స్ లో వినపడుతున్నాయి. లండన్ లో ఎంబీయే చదివిన శాలిని అనే అమ్మాయితో నితిన్ ప్రేమ వివాహం చేసుకోనున్నాడని, డెస్టినేషన్ వెడ్డింగ్ వేడుకగా నితిన్ వివాహం ఉంటుందనే ప్రచారం ఎక్కువగా జరుగుతుంది.

తాజాగా నితిన్ పెళ్లికి సంబంధించిన ఓ వార్త ఫిలిం నగర్ సర్కిల్‌లో చక్కర్లు కొడుతుంది. ఏప్రిల్ 16న దుబాయ్‌లోని ప్యాలసో వెర్సేస్‌ హోటల్‌లో నితిన్ వివాహం చేసుకోనున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. 14,15 తేదీలలో ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరగనున్నట్టు టాక్. కేవలం 500 మందిని మాత్రమే పెళ్లికి ఆహ్వానించాలని నితిన్ కుటుంబ సభ్యులు భావిస్తున్నారట. 

నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్న వీరిరివురు పెద్దల అంగీకారంతో పెళ్లి పీటలెక్కబోతున్నట్టు తెలుస్తుంది. అయితే దీనిపై ఏ విధమైన అధికారిక ప్రకటన నితిన్ కుటుంబ సభ్యులు విడుదల చేయలేదు.