HomeTelugu gossips

నాగ్ పక్కన నటించేందుకు హీరోయిన్ దొరకడంలేదు !
Published By :  Divya Valluru Image Image
Heroines trouble for Nagarjuna's Wild Dog movie
Tuesday Jan 14, 2020
టాలీవుడ్‌లో సీనియర్ హీరోలైన చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ వంటి వారికి ఇప్పుడు సమస్య ఎదురవుతోంది. టాలీవుడ్‌ సీనియర్ హీరోల సరసన నటించేందుకు అందాల భామలు నో అంటుండడంతో వారి పక్కన కథానాయికల ఎంపిక దర్శక నిర్మాతలకు పెద్ద తలనొప్పిగా మారింది. `కింగ్` నాగార్జున తాజా చిత్రం `వైల్డ్ డాగ్`కు ఇదే సమస్య ఎదురైందట.

ప్రస్తుతం నాగార్జున ప్రయోగాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం వైల్డ్ డాగ్. ఈ సినిమాలో నాగ్ ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌ ఏసీపీ విజయ్‌వర్మగా నటిస్తున్నాడు. యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగ్‌కు జోడిగా నటించే హీరోయిన్‌ కోసం చిత్ర యూనిట్ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో నాగ్‌కు జోడిగా నటించేందుకు అందాల భామలెవరు రెడీగా లేరన్న టాక్‌ వినిపిస్తోంది. సీనియర్ హీరోల సరసన నటిస్తే.. యంగ్ హీరోల సినిమాల్లో అవకాశాలు రావని భయపడుతున్నారట. ఇప్పటికే ఒకరిద్దరు హీరోయిన్లు నో కూడా చెప్పారన్న ప్రచారం జరుగుతోంది. 

నాగ్‌ చివరిగా నటించిన మన్మథుడు-2 సినిమాలో రకుల్ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్ గా నటించింది. కానీ ఈ సినిమా ఫలితం తేడా కొట్టేయటంతో ఆమెకు తెలుగులో సినిమాలే కరువయ్యాయి. దీంతో ఏజ్‌ బార్‌ హీరోల సరసన నటించేందుకు అందాల భామలు నో అనేస్తున్నారట. 

   Politics

   Lifestyle