HomeTelugu gossips

వంశి సినిమాలో గ్యాంగ్ స్టర్ రూపంలో మహేష్ బాబు
Published By :  Lasya Raghavaraju Image Image
Mahesh Babu to play a Gangster in Vamsi Paidipally's next
Thursday Dec 05, 2019
భరత్ అనే నేను, మహర్షి వంటి హిట్స్ తో మంచి జోష్ మీదున్న మహేష్ బాబు ప్రస్తుతం తన 26 వ సినిమా సరిలేరు నీకెవ్వరూ షూటింగ్ పనులతో బిజీగా ఉన్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న సరిలేరు నీకెవ్వరూ షూటింగ్ చివరి దశలో ఉంది. రష్మిక మందన్నా కతానయికటా కనిపించనున్న ఈ సినిమా  వచ్చే ఏడాది జనవరి 11 వ తేదీన రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే.  ఈ మూవీ రిలీజ్ సమయం దగ్గర పడుతుండడంతో ప్రతి సోమవారం రోజున ఒక సాంగ్ రిలీజ్ చేసేందుకు యూనిట్ రెడీ చేసుకుంటోంది.  

మహేష్ బాబు తన 27 సినిమాని వంశి పైడిపల్లి దర్శకత్వంలో చేయబోతున్నారు.  ఈ విషయాన్ని దర్శకుడు వంశి కన్ఫర్మ్ చేశారు. మహర్షి తర్వాత మళ్ళీ వీరిద్దరూ కలిసి పనిచేయనుండడంతో ఈ సినిమా పై అంచనాలు బాగానే ఉంటాయి.  ఫిబ్రవరి నుంచి సినిమా సెట్స్ మీదకు వెళ్ళబోతున్నది.  వచ్చే ఏడాది అక్టోబర్ లో దసరా సందర్భంగా రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట.

అయితే  ఈ సినిమా కథ గురించి ఒక వార్త చక్కర్లు కొడుతోంది. గ్యాంగ్ స్టర్ లైఫ్ కు సంబంధించిన కథతో ఈ సినిమా తెరకెక్కబోతున్నటు తెలుస్తోంది.  గతంలో మహేష్ బాబు గ్యాంగ్ స్టర్ సినిమాలు చాలా చేశారు.  అతడు, పోకిరి, బిసినెస్ మెన్ వంటి సినిమాలు ఈ కోవలోకి వచ్చే సినిమాలే.  అయితే గ్యాంగ్ స్టర్ లైఫ్ ఆధారంగా ఎప్పుడు మహేష్ సినిమాలు చేయలేదు.  ఇదే మొదటిసారి అని చెప్పొచ్చు.