HomeTelugu gossips

చిరుతో రీ-ఎంట్రీ ఇవ్వనున్న జెనీలియా
Published By :  Divya Valluru Image Image
Genelia likely to make her comeback with Chiru 152nd film
Friday Nov 08, 2019
సత్యం, ఢీ, రెడీ, బొమ్మరిల్లు, శశిరేఖ పరిణయం, ఆరంజ్ లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హాసిని ఉరఫ్ జెనీలియా గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. తెలుగులో చివరగా నా ఇష్టం సినిమాలో కనిపించిన జేనీలియా సినిమాలకు గుడ్ బై చెప్పి బాలీవుడ్ హీరో, చిన్నినాటి స్నేహితుడు రితేష్ దేశ్‌ముఖ్‌ని పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకి తల్లయి సంతోషంగా జీవితాన్ని గ‌డుపుతోంది.

బాలీవుడ్‌లో ఫోర్స్ 2 చిత్రంలో చిన్న పాత్రలో కనిపించిన జేనీలియాను మ‌ళ్లీ తెర‌పైకి తీసుకురావాల‌నే ప్ర‌య‌త్నాలు మొద‌ల‌య్యాయి. జెన్నీ కూడా ఇందు కోసం సుముఖంగా ఉంది. ఈ మధ్యన ప్ర‌త్యేకంగా ఫొటోషూట్ ఒకటి చేసి ఆ ఫొటోల‌ని సోష‌ల్ మీడియా ఇన్‌స్టా ద్వారా అభిమానుల‌తో పంచుకుంది. ఇద్ద‌రు పిల్ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చినా ఆదిరిపోయే ఫిట్నెస్ తో మ‌రింత గ్లామ‌ర‌స్‌గా క‌నిపించ‌డంతో ఆమెపై ద‌క్షిణాది మేక‌ర్స్ క‌న్ను ప‌డింది.

తాజాగా చిరంజీవి న‌టిస్తున్న 152వ చిత్రం ద్వారా జెనీలియాను మ‌ళ్లీ తెలుగులో రీ-ఎంట్రీ చేయించాలని  ప్లాన్ చేస్తున్నారట కొర‌టాల శివ. మెగాస్టార్ చిరు – కొరటాల కాంబోలో తెరకెక్కబోయే ఈ సినిమాలో త్రిషను కథానాయికగా సెలెక్ట్ చేసుకున్నారని వార్తలొచ్చాయి. సెకండ్ హీరోయిన్ లిస్ట్ లో ఈషా రెబ్బ పేరు వినబడినా… ప్రస్తుతం సినిమాల్లోకి రీ ఎంట్రీ కోసం చూస్తున్న జెనీలియా పేరును శివ పరిశీలిస్తున్నట్టుగా చెబుతున్నారు. ఆల్రెడీ రామ్ చరణ్ తో జెనీలియా ఆరెంజ్ చిత్రం చేసింది. ఆ పరిచయంతోనే జెనీలియా కోసం రామ్ చరణ్ సంప్రదింపులకు దిగుతున్నట్టుగా టాక్. 

డిసెంబర్ నెలలో షూటింగ్ ప్రారంభం కానున్న ఈ చిత్రాన్ని నిరంజ‌న్‌రెడ్డితో క‌లిసి రామ్‌చ‌ర‌ణ్ నిర్మించ‌బోతున్నాడు. 

   Politics

   Lifestyle