జబర్దస్త్ బ్యూటీ అనసూయ ఒకవైపు యాంకర్ గా అలరిస్తూనే నటిగా కూడా దూసుకుపోతోంది. ప్రస్తుతం కార్తికేయ హీరోగా నటిస్తున్న 'చావు కబురు చల్లగా' చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తోంది. ఇటీవలే ‘థ్యాంక్ యు బ్రదర్!’ అనే డిఫరెంట్ మూవీ కంప్లీట్ చేసింది. ఈ సినిమాలో అనసూయ గర్భవతి గా ఛాలెంజింగ్ క్యారెక్టర్ చేసింది. తాజాగా ఆమెకు మలయాళీ ఇండస్ట్రీ నుంచి ఓ బంపర్ ఆఫర్ వచ్చిందట.
అనసుయకి మళయాళం స్టార్ మమ్ముట్టి పక్కన నటించే ఛాన్స్ వచ్చిందట. మమ్మూట్టి ప్రస్తుతం భీష్మ పర్వం అనే సినిమా చేస్తున్నాడు. అందులో ఒక ముఖ్యమైన పాత్ర కోసం చిత్ర దర్శకుడు ఇటీవల అనసూయను కలిసినట్లు టాక్ వస్తోంది. పాత్ర బలంగా ఉండడంతో అనసూయ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘‘యాత్ర’ లో మమ్ముట్టి గారితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాను.. మళ్లీ ఆయనతో కలిసి నటించే అవకాశం రావడం చాలా హ్యాపీగా ఉంది.. నా క్యారెక్టర్ కోసం మలయాళం నేర్చుకుంటున్నాను.. ఏప్రిల్ నుండి ‘భీష్మ పర్వం’ సినిమాకి సంబంధించిన వర్క్ షాప్లో పాల్గొంటున్నాను’’ అన్నారు.
అనసూయ ప్రస్తుతం కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందుతున్న 'రంగమార్తాండ', చిత్రంజీవి ''ఆచార్య, అల్లు అర్జున్ పుష్ప, రవితేజ ఖిలాడీ, గోపీచంద్ పక్కా కమర్షియల్'' చిత్రాల్లో నటిస్తూ యమబిజీగా ఉంది.