వైష్టవ్ తేజ్, కృతి శెట్టి జంటగా బుచ్చి బాబు నటించిన ఉప్పెన సినిమాకు సినీ ప్రేక్షకుల నుంచే కాకుండా, సెలబ్రిటీ, విమర్శకుల ప్రశంసలు అందుతున్నాయి. తాజాగా ఉప్పెన సినిమా వీక్షించిన సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాపై ప్రసంసల వర్షం కురిపించాడు.
‘‘ఉప్పెన.. ఒక్క మాటలో చెప్పాలంటే క్లాసిక్! బుచ్చిబాబు సానా.. మీరు కలకాలం గుర్తుండిపోయే అరుదైన చిత్రాన్ని రూపొందించారు. మిమ్మల్ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. ఉప్పెనకు హార్ట్ దేవిశ్రీ ప్రసాద్. ఈ సినిమా ఆల్‌టైమ్ గ్రేట్ మ్యూజిక్ స్కోర్స్‌లో ఒకటిగా గుర్తుండిపోతుంది. ఇప్పటి వరకు నువ్వు అందించిన సంగీతంలో ఇది అత్యుత్తమం డీఎస్పీ. ఇలానే మంచి మ్యూజిక్ అందిస్తూ ఉండండి.
ఇద్దరు కొత్తవాళ్ల వైష్ణవ్ తేజ్, కృతిశెట్టి అద్భుత నటన నా మనసును హత్తుకుంది. మీరు స్టార్స్. ఇక చివరిగా ఉప్పెన లాంటి సినిమాను నిర్మించిన సుకుమార్ గారికి, మైత్రీ మూవీ మేకర్స్‌కి హ్యాట్సాఫ్. నేను చెప్పినట్టుగా ఇది కలకాలం గుర్తుండిపోయే సినిమాల్లో ఒకటి. మీ అందరినీ చూసి నాకు చాలా గర్వంగా ఉంది’’ అని మహేష్ బాబు తన ట్వీట్స్‌లో పేర్కొన్నారు.
మహేష్ బాబు ప్రశంసలతో ఉప్పెన టీం ఇప్పుడు ఆకాశంలో తేలిపోతోంది.