HomeTelugu cinema

చియాన్ విక్ర‌మ్ సరసన వాణీ భోజన్
Published By :  Lasya Raghavaraju Image Image
Vani Bhojan set to romance Chiyaan Vikram in his next
Tuesday Feb 23, 2021
‘ఓ మై కడువులే’, ’లాకప్‌’ వంటి చిత్రాల్లో నటించి మెప్పించిన హీరోయిన్ వాణీ భోజన్‌ గోల్డెన్ ఆఫర్ పట్టేసింది. ఈసారి స్టార్ హీరోతో పక్కన నటించే ఛాన్స్ కొట్కటేసింది ఈ సొగ‌స‌రి. ఇంత‌కీ వాణీ భోజ‌న్ జోడీ క‌ట్ట‌బోతున్న ఆ స్టార్ హీరో ఎవ‌రో కాదు.. చియాన్ విక్ర‌మ్‌. 

రాధామోహన్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రంలోనూ, హీరో సూర్య సొంత నిర్మాణ సంస్థపై తెరకెక్కించనున్న మరో చిత్రంలో నటించేందుకు వాణీ భోజన్‌ అగ్రిమెంట్‌ చేసుకుంది. ఈ నేపథ్యంలో కార్తీక్‌ సుబ్బురాజ్‌ దర్శకత్వంలో చియాన్ విక్రమ్ హీరోగా రూపొందనున్న చిత్రంలో విక్రమ్‌ సరసన నటించే అవకాశం రావడంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఓకే చేసిందీ ముద్దుగుమ్మ.  

కార్తీక్‌ సుబ్బురాజ్‌ విక్రమ్‌, ఆయన కుమారుడు ధృవ్‌ విక్రమ్‌ కలిసి నటించనున్నారు. ఇందులో విక్రమ్‌ సరసన నటించేందుకు వాణీ భోజన్‌ను ఎంపిక చేశారు. ధృవ్‌ విక్రమ్‌ కోసం కథానాయికను ఎంపిక చేయాల్సి ఉంది. ఈ మూవీ పూర్తి యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కనుంది. ఇదిలావుంటే విక్రమ్‌ ప్రస్తుతం ‘కోబ్రా’ చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే. 

   Politics

   Lifestyle