HomeTelugu cinema

మామీ రాక్స్ అంటూ నిర్మలా గారిపై హీరో సిద్ధార్ద్ సెటైర్లు
Published By :  Lasya Raghavaraju Image Image
Actor Siddharth takes Maami dig at Nirmala sitharaman over fuel hike
Tuesday Feb 23, 2021
దేశంలో ఇంధన ధరల మోత మోగుతోంది. కొన్ని ప్రాంతాల్లో దేశ చరిత్రలోనే పెట్రోల్‌ ధర తొలిసారి సెంచరీ కొట్టింది. పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెరుగుదలపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ నిస్సహాయత వ్యక్తం చేశారు. ప్రభుత్వరంగ చమురు సంస్థలే ధరల పెరుగుదలకు కారణమని ఆమె చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై సర్వత్రా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. 

తమిళ, తెలుగు నటుడు సిద్ధార్ధ్ కూడా ఈ విషయమై తన అసహనాన్ని వ్యక్తం చేస్తూ ఏకంగా కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పై సెటైర్ వేశారు. 2013లో ప్రతిపక్షంలో ఉండగా ఆమె పెట్రోల్ ధరలు తగ్గించాలంటే కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని వ్యాఖ్యానించారు.
ఇప్పుడు మంత్రిగా ఉన్న సమయంలో ఆయిల్ కంపెనీలు ధరలపై ఆలోచన చేయాలి అంటున్న వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఈ వీడియోనే షేర్ చేస్తూ సిద్ధార్ద్ సెటైర్లు వేశారు. 

‘నమ్మిన సిద్ధాంతాలకు చెప్పిన మాటలకు కట్టుబడి ఉండటంలో మామి నెక్స్ట్ లెవల్. ఉల్లిపాయలు లేవు, సిద్ధాంతాలు లేవు, గుర్తు కూడా లేదు.. మామి రాక్స్’ అంటూ ట్విట్టర్ లో స్పందించారు. అయితే కొందరు నిర్మలా సీతారామన్‌ను ‘మామి’ (ఆంటీ) అని సంబోధించడంపై సిద్ధార్థ్‌ను నెటిజన్లు తప్పుబడుతున్నారు.  ప్రస్తుతం ఈ ట్వీట్ రాజకీయంగా వైరల్ అయింది. 

   Politics

   Lifestyle