HomeTelugu cinema

ధనుష్ జగమే తందిరం టీజర్ వచ్చేసింది
Published By :  Divya Valluru Image Image
Dhanush Jagame Thanthiram Teaser looks fun and entertaining
Monday Feb 22, 2021
కోలీవుడ్ సూపర్ స్టార్ ధనుష్ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ‘జగమే తందిరం’ (తెలుగులో జగమే తంత్రం) టీజర్ ఈ రోజు విడుదలైంది. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రూపొందిన జగమే తందిరం సినిమాకు సంబంధించిన టీజర్ సినిమాపై అంచనాలను పెంచింది. .

పల్లెటూళ్ళో ఆకతాయిగా పెరిగి, రౌడీగా పేరు తెచ్చుకున్న ధనుష్ విదేశాల్లో గ్యాంగ్‌స్టర్‌గా ఎలా అవతరించాడు? అక్కడి పోలీసులతో ఎలా ఆడుకున్నాడు? అనేది టీజర్‌లో చూపించగా  ధనుష్ తన మార్క్‌ కామెడీతో మరోసారి హండ్రెడ్ పర్సెంట్ ఎంటర్‌టైన్మెంట్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడని తెలుస్తోంది. ఐశ్వర్య లక్ష్మీ ఫీమేల్ లీడ్‌ రోల్‌లో కనిపించబోతోన్న ఈ చిత్రాన్ని నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్. 

ప్రముఖ నిర్మాత ఎస్. శశికాంత్ నిర్మిస్తోన్న ఈ సినిమా ధనుష్ కెరీర్ లో ఇది 40వ సినిమా.

   Politics

   Lifestyle