కెమెరామెన్ నుంచి దర్శకుడిగా ఎదిగిన తేజ ప్రస్తుతం టాలీవుడ్లో ఉన్న మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్లలో ఒకడిగా పేరుతెచ్చుకున్నాడు. తేజ `చిత్రం` సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. 2000లో విడుదలైన ఈ `చిత్రం` తేజను మాత్రమే కాదు.. ఎంతో మందిని తెలుగు తెరకు పరిచయం చేసింది. హీరో ఉదయ్‌కిరణ్‌కు, హీరోయిన్ రీమాసేన్‌కు కూడా ఇదే తొలి సినిమా. ఆర్పీ పట్నాయక్ ఈ సినిమాతో సంగీత దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
దాదాపు 21 ఏళ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ రూపొందుతోంది. ఈ విషయాన్ని డైరెక్టర్ తేజ తాజాగా ప్రకటించాడు. ఈ సినిమాకు `చిత్రం 1.1` అనే టైటిల్‌ను ఫిక్స్ చేశాడు. ఈ సినిమాకు కూడా ఆర్పీ పట్నాయక్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాతో 45 మంది కొత్త వాళ్లను తేజ టాలీవుడ్‌కు పరిచయం చేయబోతున్నాడు. తేజ సొంత నిర్మాణ సంస్థ `చిత్రం మూవీస్`, `ఎస్ స్టూడియోస్` ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సమీర్ రెడ్డి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్న ఈ సినిమాకు ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు. వచ్చే నెల నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతోంది.
తేజ పరిశ్రమకు పరిచయం చేసిన వాళ్ళలో నితిన్, సదా, కాజల్, నవదీప్, సుమన్ శెట్టి, మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ లాంటి వారు ఉన్నారు.