బాలీవుడ్లో గతకొంత కాలంగా బయోపిక్స్ సినిమాల హవా నడుస్తోంది. సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖుల బయోపిక్‌లకు ప్రేక్షకుల నుంచి విశేషమైన ఆదరణ లభిస్తోంది. తాజాగా కార్గిల్ యుద్దంలో చురుకుగా పాల్గొని, పరమ వీరచక్ర బిరుదు అందుకున్న ఆర్మీ ఆఫీసర్, కెప్టెన్ విక్రమ్ బాత్రా జీవితం ఆధారంగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. సిద్ధార్థ్ మల్హోత్రా కెప్టెన్ విక్రమ్ బాత్రా క్యారెక్టర్లో నటిస్తున్నారు.
విక్రమ్‌ని పాకిస్థాన్ ఆర్మీ ‘షేర్షా’ అని పిలిచే వారు.. అందుకే ఆయన బయోపిక్‌కి ఈ టైటిల్ పెట్టారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా విడుదల తేదిని అనౌన్స్ చేశారు. 2021 జూలై 2 ‘షేర్షా’ భారీ స్థాయిలో విడుదల కానుంది. సిద్ధార్థ్ పక్కన కైరా అద్వాణీ కథానాయికగా నటిస్తోంది. విష్ణు వర్థన్ దర్శకుడు.
ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై, కరణ్ జోహార్, హీరూ జోహార్, అపూర్వ మెహతా, షబ్బీర్ బాక్స్ వాలా, అజయ్ షా, హిమాన్షు గాంధీ కలిసి నిర్మిస్తున్నారు.