HomeTelugu cinema

ఎన్టీఆర్ తొ రెండోసారి జతకట్టనున్న పూజా హెగ్డే
Published By :  Sushma Paidipalli Image Image
Pooja Hegde to pair opposite NTR in Trivikrams next
Wednesday Jan 13, 2021
నాగ చైతన్య సరసన ఒక లైలా కోసం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన పూజా హెగ్డే ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది.  తెలుగులో అలా వైకుంఠపురములో, అరవింద సమేత, గద్దల కొండ గణేష్ ఈ అమ్మడికి మంచి పేరును తీసుకువచ్చాయి.  ప్రస్తుతం అఖిల్ పక్కన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో, ప్రభాస్ జోడీగా రాధే శ్యామ్ చిత్రాల్లో నటిస్తోంది. అయితే ఇప్పుడు ఈ అమ్మడు మరో స్టార్ హీరో పక్కన ఛాన్స్ కొట్టేసినట్లు స్వయంగా చెప్పింది. 

సోమవారం జరిగిన అలా వైకుంఠపురంలో రీ యూనియన్ మీటింగులో తన తర్వాతి సినిమా చెప్పకనే చెప్పింది పూజా. తన తర్వాతి సినిమా త్రివిక్రమ్ తో చేయబోతున్నా అంటూ నోరు జారింది. అయితే వెంటనే నెటిజన్లు ఓ క్లారిటీకి వచ్చేశారు. త్రివిక్రమ్ నెక్స్ట్ సినిమా ఎన్టీఆర్ తో చేయబోతున్నారని అందులో పూజానే హీరోయిన్ అని డిసైడ్ అయ్యారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన హీరోయిన్ ఎవరనేది మొదట నుంచి సస్పెన్స్ గా మారింది. ఇక పూజా వ్యాఖ్యలతో సస్పెన్స్ కి తెరపడింది. 

అరవింద సమేత తర్వాత ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్లో రానున్న ఈ సినిమాకు అయినను పోయిరావలె హస్తినకు అనే టైటిల్ ప్రచారంలో ఉంది.

   Politics

   Lifestyle