HomeTelugu cinema

వర్కవుట్లతో మ‌తి పోగొడుతున్న తమన్నా ఫొటోలు వైర‌ల్
Published By :  Divya Valluru Image Image
Tamannah Bhatia workout video goes viral
Wednesday Jan 13, 2021
మిల్కీ బ్యూటీ  త‌మ‌న్నా ఈ మధ్యనే కరోనా బారినపడి సురక్షితంగా బయటపడింది.  కరోనా పాజిటివ్ అని రావడంతో దాదాపు ఓ పదిహేను రోజులు మెడికేషన్ ఫాలో అవుతూ ఫుల్ రెస్ట్ తీసుకుంది. మెడికేష‌న్‌లో భాగంగా పూర్తిగా విశ్రాంతి తీసుకోవడం, మందులు వాడ‌డం వ‌ల‌న త‌మ్మూ లావైపోయింది. మొహంలో మార్పులు వచ్చాయి.  ఆ మ‌ధ్య బొద్దుగా మారిన త‌మ‌న్నాని చూసి చాలా మంది షాక‌య్యారు. 

తమన్నా ఇప్పుడు తన పాత రూపంలోకి మారేందుకు జిమ్‌లో తెగ వ‌ర్క‌వుట్స్ చేస్తుంది. ఖాళీ దొరిక‌న‌ప్పుడ‌ల్లా జిమ్‌కే ప‌రిమిత‌మ‌వుతూ చెమ‌టలు కారుస్తుంది. తాజాగా పొట్టి దుస్తుల‌లో త‌మ‌న్నా చేస్తున్న వ‌ర్క‌వుట్స్‌కు సంబంధించిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. వీటిని చూసి నెటిజ‌న్స్ మైమ‌రచి‌పోతున్నారు. 

తమన్నా త్వరలో సీటీమార్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే గుర్తుందా శీతాకాలం, నితిన్ అందాధున్ రిమేక్,  ఎఫ్ 3 సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి.

   Politics

   Lifestyle