దగ్గుబాటి రానా, సాయి పల్లవి జంటగా నీది నాది ఒకే కథ ఫేం వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "విరాటపర్వం". 80ల్లో తెలంగాణ పల్లెల్లో జరిగిన సాయుధ పోరాటం బ్యాక్ డ్రాప్ లో సాగే అందమైన ప్రేమకథగా రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రియమణి ఒక కీలక పాత్రలో నటిస్తోంది. నందితాదాస్, నవీన్‌చంద్ర, జరీనా వాహబ్, ఈశ్వరీరావు, సాయిచంద్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్ విశేషంగా ఆకట్టుకున్నాయి. సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రం నుండి విడుదలైన కొత్త పోస్టర్ విడుదలైంది. పోస్టర్లో నక్సలైట్ గెటప్‌లో కనిపిస్తున్న రానా చేతిని పట్టుకొని సాయి పల్లవి నవ్వుతూ కనిపించింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.
ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న విరాటపర్వం చిత్రం గత ఏడాది విడుదల కావలసి ఉన్నప్పటికీ కరోనా వలన వాయిదా పడింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను శరవేగంగా జరుపుతూ ఉండగా, సమ్మర్లో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.