HomeTelugu cinema

వైర‌ల్‌గా మారిన పవన్ కళ్యాణ్ న్యూ లుక్ ఫొటోలు
Published By :  Divya Valluru Image Image
Pawan Kalyan traditional new look photos in White goes viral online
Wednesday Jan 13, 2021
రెండేళ్ల పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉండి సినిమాలను పక్కన పెట్టిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు వ‌కీల్ సాబ్ చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తున్న సంగ‌తి తెలిసిందే. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ  సినిమా షూటింగ్ కొద్ది రోజుల క్రితం పూర్తి కాగా, ఇటీవ‌ల క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న చారిత్రాత్మ‌క చిత్రంతో పాటు 'అయ్యప్పనుమ్ కోషియుమ్‌’ రీమేక్ మూవీని కూడా మొద‌లు పెట్టాడు పవన్. 

సాగ‌ర్ కె.చంద్ర ద‌ర్శక‌త్వం వహిస్తున్న 'అయ్యప్పనుమ్ కోషియుమ్‌’ రిమేక్ చిత్రాన్ని  సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.  తమన్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో రానా ఓ ప‌వ‌ర్ ఫుల్ పాత్ర పోషిస్తున్నాడు. ప‌వ‌న్, రానా మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు ప్రేక్ష‌కుల‌కు స‌రికొత్త వినోదాన్ని అందిస్తాయ‌ని అంటున్నారు. అయితే ఈ సినిమాలో ప్ర‌ధాన పాత్ర పోషిస్తున్న ప‌వ‌న్ తాజాగా పంచె క‌ట్టులో మెరిసారు. కార్ వ్యాన్ నుండి పంచె ధరించి వ‌స్తున్న ప‌వ‌న్ ఫొటోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. ఈ లుక్‌లో ప‌వ‌న్‌ని చూసిన అభిమానులు  తెగ మెరిసిపోతున్నారు. 

కాగా అయ్యప్పనుమ్ కోషియుమ్‌ తెలుగు వర్షన్లో  పవన్ సరసన నటించేందుకు సాయిప‌ల్ల‌వి‌ ప‌చ్చ జెండా ఊపింద‌ని ఫిలింన‌గ‌ర్ లో అప్ డేట్ ఒక‌టి చ‌క్క‌ర్లు కొడుతోంది.

   Politics

   Lifestyle