HomeTelugu cinema

వాష్‌రూంలో జారిప‌డి చేయి విరగ్గొట్టుకున్న నభా నటేష్
Published By :  Divya Valluru Image Image
Heroine Nabha Natesh fell in washroom in Dubai
Wednesday Jan 13, 2021
ఇస్మార్ట్ బ్యూటీ న‌భాన‌టేశ్ న‌టించిన సోలో బ్ర‌తుకే సో బెట‌రు ఇటీవ‌లే ప్రేక్ష‌కుల ముందుకువ‌చ్చి మంచి టాక్ తెచ్చుకుంది.  బెల్లంకొండ శ్రీనివాస్ సరసన నటించిన అల్లుడు అదుర్స్ మ‌రో రెండు రోజుల్లో థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నుంది. అయితే ఎప్పుడూ హుషారుగా క‌నిపించే టాలీవుడ్ భామ న‌భాన‌టేశ్ సడెన్ గా చేతికి ప‌ట్టీతో క‌నిపించిన ఫొటో నెట్టింట్లో చ‌క్క‌ర్లు కొట్టింది. దీంతో న‌భాన‌టేశ్ కు ఏమైందా..? అని తెగ చ‌ర్చించుకుంటున్నారు. 

తన చేతిగాయం పై ఇటీవల నభా ఓ ఇంట‌ర్వ్యూ లో క్లారిటీ ఇచ్చింది.  నేను దుబాయ్ లో వాష్‌రూంలో జారిప‌డ్డాను. చేతికి గాయ‌మవ‌డంతో ఆప‌రేష‌న్ చేశారు. రెండు వారాలు విరామం తీసుకున్నా. గాయం తగ్గినతర్వాత నేను మ‌ళ్లీ వెంట‌నే వ‌చ్చి షూటింగ్ లో జాయిన్ అయ్యాను. ఈ విష‌యంలో ప్ర‌తీ ఒక్క‌రూ నాకు చాలా సపోర్టు చేశారని చేతి గాయం గురించి చెప్పుకొచ్చింది.

సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన అను ఎమ్మాన్యుయేల్ మరో క‌థానాయిక‌గా న‌టిస్తోంది. సుమంత్ మూవీ ప్రొడ‌క్షన్స్ బ్యాన‌ర్‌పై జి.సుబ్రహ్మణ్యం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు . డూడ్లే ఈ సినిమాకు సినిమాటోగ్రఫిని అందిస్తుండగా, రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.

   Politics

   Lifestyle