రామ భక్తులు ఎన్నో ఏళ్లుగా కలలు కంటున్న అయోధ్య రామ మందిర్ నిర్మాణానికి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. హిందువులకు ఎంతో ప్రీతిపాత్రుడైన శ్రీరామ చంద్రుడి ఆలయాన్ని అత్యంత వైభవోపేతంగా నిర్మించాలని ఆలయ ట్రస్ట్ నిర్ణయించింది. దాదాపు రూ. 1100 కోట్ల వ్యయంతో ఈ మందిరాన్ని నిర్మిస్తున్నారు. ఇందుకోసం రామ మందిర్ నిధి పేరుతో విరాళాలు సేకరిస్తోంది.
తాజాగా నటి ప్రణీత సుభాష్ రామ మందిర్ నిర్మాణానికి లక్ష రూపాయల విరాళాన్ని అందిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఆమె తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేశారు. అందరూ ముందుకొచ్చి రామ మందిర నిర్మాణం కోసం విరాళాలు అందించాలని కోరుతూ ఓ వీడియోను ప్రణీత ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
ఇటీవల కరోనా ప్యాండమిక్లో కూడా ప్రణీత తన వంతుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టి తన గొప్ప మనసును చాటుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం తెలుగులో పెద్దగా నటించని ప్రణీత కన్నడలో మాత్రం బిజీ హీరోయిన్ అయింది.