సింగర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా, యాంకర్‌గా టాలీవుడ్ ప్రేక్షకుల మదిలో చెరగని ముద్రవేసిన సునీత రెండురోజుల క్రితం రామ్ వీరపనేనితో ఏడడుగులు వేసి కొత్త జీవితంలోకి అడుగుపెట్టింది. అంగరంగ వైభంగా జరిగిన ఈ వివాహానికి ప్రముఖ సినీతారలు హాజరయ్యి సునీతను విష్ చేశారు. ఈ పెళ్లిని వారి పిల్లలు దగ్గరుండి జరిపించారు. అయితే సునీత రెండో వివాహంపై క్రిటిక్ కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
"సునీత కళ్ళలో ఆనందం ఏంటి. ఆ ఆనందాన్ని చూస్తుంటే చాలా బాధగా ఉంది. ఎవరైనా రెండో పెళ్లి చేసుకుంటే. ఎవరీకీ తెలీకుండా చాటుగా చేసుకుంటారు. బయటకు చెప్పడానికి చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. కానీ సునీత మాత్రం అలా కాకుండా రెండో పెళ్లి చేసుకుంటూ కూడా ఆ ఆనందం ఏంటి? ఇలా చేస్తూ సమాజానికి ఎలాంటి సందేశం ఇస్తున్నారు? సమాజం నాశనం అయిపోదా?’ అంటూ కత్తి మహేష్ తన ఫేస్ బుక్‌లో పోస్ట్ చేశాడు.
ఈ పోస్ట్ ద్వారా సునీత రెండో వివాహంపై నెగిటివ్ కామెంట్ చేస్తున్న వారికి కౌంటర్ వేశాడు. కానీ కొందరు నెటిజన్లు మాత్రం దీనిని తప్పుబట్టారు. అయితే సమాజంలో ప్రతి దానిపై నెగిటివ్ కామెంట్లు చేస్తుంటారు. వారికి బుద్ది చెప్పాలనే కత్తి మహేష్ ఈ తరహా పోస్ట్ చశాడు. కానీ కత్తి మహేష్ తన క్రిటిక్ బాషలో చెప్పడంతో అర్థం కాని ప్రజలు కత్తి మహేష్‌ను అపార్థం చేసుకొని తిట్టుకుంటున్నారు. కొందరు విషయాన్ని సూటిగా చెప్పడం నేర్చుకోవాలని కూడా కామెంట్ చేస్తున్నారు.
ఏది ఏమయినా కత్తి మహేష్ సమాజంలో ప్రతి దానిని నెగిటివ్‌గా చూసేవారికి గట్టి కౌంటర్ వేశాడు.