HomeTelugu cinema

కరోనా నుంచి క్షేమంగా కోలుకున్న రామ్ చరణ్
Published By :  Divya Valluru Image Image
Ram Charan tested Negative for Corona shares news with fans
Tuesday Jan 12, 2021
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. తాజాగా చేసిన పరీక్షలలో ఆయనకు కరోనా నెగటివ్ వచ్చింది. రామ్‌చరణ్‌ స్వయంగా ట్విట్టర్‌ ద్వారా ఈ సంతోషకర విషయాన్ని ప్రకటించారు. 

`కోవిడ్‌-19 టెస్ట్ చేయించుకోగా, నాకు కరోనా నెగటివ్‌ అని తేలింది. ఈ విషయాన్ని పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. షూటింగ్‌లో పాల్గొనేందుకు వెయిట్‌ చేయలేకపోతున్నా. విషెస్‌ తెలియజేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు` అంటూ రామ్ చరణ్ ట్వీట్ చేసాడు. 

రామ్ చరణ్‌ డిసెంబర్ 29న తనకు కరోనా సోకినట్లు తెలియజేసాడు.  తనకు కొవిడ్-19 పాజిటివ్ వచ్చిందని.. కానీ ఎలాంటి లక్షణాలు లేవని చరణ్ పేర్కొన్నారు. అప్పటి నుంచి ఆయన భార్య  ఉపాసనతో పాటు హోమ్ క్వారంటైన్‌లోనే ఉన్నారు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో మన్యం వీరుడు అల్లూరిగా చరణ్ కనిపించనున్నాడు. అందుతున్న సమాచారం ప్రకారం, చరణ్ అలియా భట్ తో కలిసి సంక్రాంతి తరువాత ఆర్ఆర్ఆర్ సెట్లలో చేరనున్నారు. ఈ సినిమా తర్వాత చిరంజీవి కొరటాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆచార్య’ సినిమాలో నటిస్తున్నాడు చరణ్. ఈ రెండు సినిమాలతర్వాత చెర్రీ ఎవరితో సినిమా చేస్తాడన్నదానిపై ఇంతవరకు క్లారిటీ రాలేదు. 



   Politics

   Lifestyle