HomeTelugu cinema

జాన్వీ కపూర్ గుడ్ లక్ జెర్రీ ప్రారంభం
Published By :  Divya Valluru Image Image
Janhvi Kapoor Good Luck Jerry begins shoot in punjab
Tuesday Jan 12, 2021
దివంగత నటి శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ ధడక్ సినిమాతో కథానాయికగా జనం ముందుకొచ్చి "గుంజన్ సక్సెనా: ది కార్గిల్ గర్ల్" సినిమాతో విశ్లేషకుల ప్రసంసలు దక్కించుకుంది. ప్రస్తుతం 'రూహీ అఫ్జానా'తో పాటు 'దోస్తానా 2'లో నటిస్తున్న జాన్వీ కపూర్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. 

సిద్ధార్థ్ సేన్ గుప్తా దర్శకత్వంలో ఆనంద్ ఎల్ రాయ్ నిర్మిస్తున్న 'గుడ్ లక్ జెర్రీ' మూవీలో జాన్వీ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ సోమవారం పంజాబ్‌లో మొదలైంది. ఈ సినిమా తొలి షెడ్యూల్ మార్చి వరకూ జరుగబోతోంది. ఇందులో జాన్వీ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.  సింపుల్ పంజాబీ డ్రెస్‌లో మిడిల్ క్లాస్ అమ్మాయిగా కనిపిస్తున్న జాన్వీ లుక్‌కు నెటిజన్ల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ లభిస్తోంది.  నయనతార ప్రధాన పాత్రలో తమిళంలో సూపర్ హిట్ సాధించిన ‘కొలమావు కోకిల’ చిత్రానికి ఇది రిమేక్ అని ప్రచారం జరుగుతోంది. 

ఈ మూవీలో దీపక్ డోబ్రియల్, మీత వశిష్ట, నీరజ్ సూద్, సుశాంత్ సింగ్ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.


   Politics

   Lifestyle